Home /News /crime /

HEROIN WORTH RS 6 CRORE EXTRACTED FROM SUDANI WOMAN BODY OVER 12 DAYS IN RAJASTHAN PVN

Shocking : మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో రూ.6 కోట్ల హెరాయిన్..స్కానింగ్ చూసి అధికారులు షాక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Heroin In Woman Body : ఎయిర్ పోర్ట్ లో ఆ మహిళకు స్కానింగ్​ నిర్వహించగా.. వచ్చిన రిపోర్ట్ చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. కొన్ని క్సాప్సుల్స్​ ఆమె కడుపులో మరికొన్ని ఆమె ప్రైవేట్​ పార్ట్స్ ​లోదాచినట్లు గుర్తించారు. హెరాయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు మొత్తంగా 12 రోజులు పట్టింది.

ఇంకా చదవండి ...
Heroin In Woman Body : ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా దేశంలోకి డ్రగ్స్ రవాణా ఆగడం లేదు. యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ ల వద్ద మరింత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొత్త కొత్త మార్గాలను అన్వేషించి మరీ విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ని మనదేశంలోకి తరలిస్తున్నారు నేరగాళ్లు. డ్రగ్స్‌ ను మన దేశానికి తరలించేందుకు స్మగ్లర్స్ చేస్తున్న ప్రయత్నాలు పోలీసులను, అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

హెరాయిన్​ క్యాప్సుల్స్​ ను కడుపులో దాచి స్మగ్లింగ్​ యత్నించిన వ్యక్తి అరెస్ట్​ అయిన ఘటన జరిగిన కొద్ది రోజులకే తాజాగా అటువంటిదే మరోటి వెలుగులోకి వచ్చింది. క్యాప్సుల్స్ రూపంలో హెరాయిన్​ ను శరీరంలోని ప్రైవేట్​ భాగాల్లో దాచి స్మగ్లింగ్ ​కు యత్నించిన ఓ మహిళను తాజాగా అధికారులు అరెస్ట్​ చేశారు. ఆమె నుంచి రూ.6 కోట్లు విలువ చేసే 862 గ్రాముల హెరాయిన్​ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ లో రూ. 6 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ ఘటన రాజస్తాన్​ లోని జైపుర్​ ఎయిర్ పోర్ట్ లో గతనెల 19న జరిగింది.

ALSO READ అంబులెన్స్‌లో పెళ్లి మండపానికి వరుడు..స్ట్రెచర్‌పై పెళ్లి కొడుకుని చూసి బంధు,మిత్రులు షాక్

సూడాన్ ​కు చెందిన మహిళ గత నెల 19న జైపూర్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. శరీరంలో మొత్తం 88 హెరాయిన్ క్యాప్సుల్స్​ దాచుకుని ఆమె ఇక్కడకు వచ్చింది. ఎయిర్ పోర్ట్ లో ఆ మహిళకు స్కానింగ్​ నిర్వహించగా.. వచ్చిన రిపోర్ట్ చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. కొన్ని క్సాప్సుల్స్​ ఆమె కడుపులో మరికొన్ని ఆమె ప్రైవేట్​ పార్ట్స్ ​లోదాచినట్లు గుర్తించారు. మెజిస్ట్రేట్​ నుంచి అనుమతి పొందిన అధికారులు ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య డాక్టర్లు వీటిని వెలికి తీశారు. నిందితురాలి నుంచి హెరాయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు మొత్తంగా 12 రోజులు పట్టింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్​ అయిన తర్వాత బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నిందితురాలికి 14 రోజుల రిమాండ్​ విధించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Drugs, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు