ఢిల్లీలో భారీ డ్రగ్స్ దందా... రూ. 200 కోట్ల హెరాయిన్ పట్టుకున్న పోలీసులు...

యాపిల్ పండ్లు నింపిన కార్టన్ బాక్సుల్లో నిల్వ చేసి హెరాయిన్ తరలింపు... లారీని తనిఖీ చేసిన పోలీసులకు షాక్... జమ్ము కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న డ్రగ్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 9:54 PM IST
ఢిల్లీలో భారీ డ్రగ్స్ దందా... రూ. 200 కోట్ల హెరాయిన్  పట్టుకున్న పోలీసులు...
కార్టన్ బాక్సుల్లో దొరికిన హెరాయిన్ ప్యాకెట్లు (twitter/ANI)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 9:54 PM IST
ఢిల్లీలో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆజాద్‌పుర మండీ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. యాపిల్ పండ్లు కార్టన్ బాక్సుల్లో నిల్వ చేసి తరలిస్తున్న లారీని తనిఖీ చేసిన పోలీసులకు షాక్ తగిలింది. యాపిల్ పండ్ల కింద వందల కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని ప్యాక్ చేసి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు... హెరాయిన్‌ను జమ్ము కశ్మీర్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్టు నిర్ధారించారు.

దాదాపు 200 కోట్ల విలువైన హెరాయిన్ చేజిక్కడం దేశచరిత్రలోనే ఇదే మొదటిసారి. జమ్ము కశ్మీర్ కుప్‌‌వరా ప్రాంతం నుంచి భారీగా హెరాయిన్ ఢిల్లీకి తరలిస్తున్నట్టు పోలీసులు ఖరారు చేశారు. ఢిల్లీలోని ప్రముఖ పబ్స్, నైట్ క్లబ్‌లకు డ్రగ్స్ సప్లై చేసే ముఠాయే ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ డ్రగ్స్ దందా ఎప్పటి నుంచే సాగుతుందనే విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దేశరాజధానిలో కొన్నేళ్లుగా డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హార్యానాల్లో యువత డ్రగ్స్‌ బానిసయ్యారు. నైట్ పార్టీలు, పబ్, క్లబ్‌లతో పాటు కాలేజీలు, స్కూళ్లలో కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు దొరికిన హెరాయిన్ మోతాదు చూస్తూ ఆశ్చర్యపోయిన పోలీసులు, ఏ లెవెల్‌లో డ్రగ్స్ సప్లై జరుగుతుందునని షాక్ అవుతున్నారు.

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...