ఔటర్ రింగ్ రోడ్డుపై హీరో రాజశేఖర్ కారు బోల్తా

ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. కారులో వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 13, 2019, 12:14 PM IST
ఔటర్ రింగ్ రోడ్డుపై హీరో రాజశేఖర్ కారు బోల్తా
హీరో రాజశేఖర్ కారు బోల్తా
  • Share this:
హీరో రాజశేఖర్ కారు బోల్తా పడింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే వెంటనే కారులో ఉన్నఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడిటన్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. శంషాబాద్ గోల్కండ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీ కొట్టినట్లు

ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. రాజశేఖర్ కాళ్లు, చేతులకు గాయాలు అయినట్టు సమాచారం. కారులో వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వెళ్లిన రాజశేఖర్, తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తరువాత, సిటీలోకి రాకుండా, నేరుగా జూబ్లీహిల్స్ కు చేరుకునే క్రమంలో అవుటర్ పై కారులో వెళ్లారని ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని సమాచారం.

First published: November 13, 2019, 8:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading