కార్ యాక్సిడెంట్ కేసులో ... పోలీసులు ముందుకు హీరో రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్ పై కూడా కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు.

news18-telugu
Updated: August 23, 2019, 3:21 PM IST
కార్ యాక్సిడెంట్ కేసులో ... పోలీసులు ముందుకు హీరో రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో (Source: twitter)
  • Share this:
నార్సింగి కార్ యాక్సిడెంట్  కేసులో హీరో రాజ్ తరుణ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. రాజ్ తరుణ్‌ ఇచ్చిన స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అతనిపై 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు నార్సింగి  పోలీసులు. రాజ్ తరుణ్ యాక్సిడెంట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్ పై కూడా కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్‌ స్టేట్ మెంట్ రికార్డ్ చేశామన్నారు  మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు. రాజ్ తరుణ్ పై 279, 336 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడన్న దానిపై తమకు సరైన ఆధారాలు లభించలేదన్నారు. రాజ్ తరుణ్ ఆక్సిడెంట్ వీడియో లు తో కార్తిక్ అనే వ్యక్తి బెదిరింపులు దిగాడని తెలిపారు. రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. సోమవారం మరోసారి విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని రాజ్ తరుణ్‌ను ఆదేశించామన్నారు.First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>