2019లో వేటగాళ్ల విజృంభన..పులులు, చిరుతలకు రక్షణ కరువు

2019లో దేశంలో 110 పులులు మరణించగా...వీటిలో ఎక్కువ వేటగాళ్ల దాడుల్లో బలైనవే కావడం జంతు ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం.

news18-telugu
Updated: January 1, 2020, 11:43 AM IST
2019లో వేటగాళ్ల విజృంభన..పులులు, చిరుతలకు రక్షణ కరువు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వన్యప్రాణుల సంరక్షణ నినాదం 2019 సంవత్సరంలో గాలిలో దీపంలానే మారింది. పులులు, చిరుతలకు సంరక్షణ కరువయ్యింది. గత సంవత్సరం దేశం 110 పులులను కోల్పోయింది. ఇందులో మూడో వంతు వేటగాళ్ల దాడుల్లో బలైనవే కావడం జంతుప్రియులను తీవ్ర ఆందోళనకు, ఆగ్రహానికి గురిచేస్తున్న అంశం. 38 పులులు వాటి శరీరభాగాల కోసం వేటగాళ్లు జరిపిన దాడుల్లో మృతి చెందగా...పులల మధ్య ఘర్షణల్లో 36, రోడ్డు, రైలు ప్రమాద ఘటనల్లో మూడు పులలు మృతి చెందాయి. అంతకు ముందు ఏడాది 2018లో 104 పులులు మృతి చెందినట్లు నమోదయ్యింది. వీటిలో దుండగులు వేటాడిన ఘటనల్లో 34 పులులు బలికాగా...2019లో 38 పులులు బలయ్యాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీఎస్ఐ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ గణాంకాలను వెల్లడింది.

telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
ప్రతీకాత్మక చిత్రం

ఈ నివేదిక మేరకు 2019లో దేశంలో 491 చిరుతలు మృతి చెందాయి. డబ్ల్యూపీఎస్ఐ గణాంకాల మేరకు 2018 సంవత్సరంలో 500 చిరుతలు మృతి చెందాయి. రోడ్డు, రైలు ప్రమాద ఘటనల్లోనే మూడో వంతు చిరుతలు మృతి చెందడం ఆందోళనకర పరిణామం. రోడ్ల విస్తరణతో వాహనాల వేగం పెరిగి చిరుతలు వాహనాల కిందపడి పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయని డబ్ల్యూపీఎస్ఐ తెలిపింది.

tiger,fight,tiger fight,tiger vs lion,lion vs tiger real fight,lion vs tiger,lion vs tiger fight,tiger attack,animal fights,lion vs tiger fight to death,tiger vs tiger,tiger vs dog fight,dog vs tiger fight,tiger vs lion fight,tiger vs tiger fight,animal fight,tiger (animal),tiger vs pitbull fight,tiger vs lion real fight,lion vs tiger full fight,tiger vs lion full fight,tigers,ranthambore national park,ranthambore,national park,ranthambore national park tiger,ranthambore national park safari,rathambore national park,ranthambore national park (protected site),ranthambore fort,ranthambore tiger safari,ranthambore safari,ranthambore national park vlog,ranthambore national park trip,ranthambore national park 2019,ranthambore national park wiki,ranthambore national park zone 2,telugu news, పులుల భీకర యుద్ధం, ఆడపులి కోసం కొట్లాట
ప్రతీకాత్మక చిత్రం


అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2019లో 29 పులులు మరణించాయి. 22 పులుల మరణాలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో 12, ఉత్తరాఖండ్‌లో 12, యూపీలో ఆరు పులులు మరణించాయి. 2018లో మధ్యప్రదేశ్‌లో 23, మహారాష్ట్రలో 19, కర్ణాటకలో 16, ఉత్తరాఖండ్‌లో 8, యూపీలో 6 పులులు మరణించాయి.

అయితే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) అధికారిక గణాంకాల మేరకు 2018లో 102 పులల మరణాలు నమోదుకాగా...2019లో ఈ సంఖ్య 92కి తగ్గింది.
Published by: Janardhan V
First published: January 1, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading