హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime: ప్రియుడ్ని హత్య చేసిన ప్రియురాలు..! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు..!

Crime: ప్రియుడ్ని హత్య చేసిన ప్రియురాలు..! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు..!

వారి దెబ్బలు భరించలేక అతడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులకు మెలకువ వచ్చింది. జరిగిందేంటో గ్రహించి వెంటనే వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. స్థానికులు వారిని అడ్డుకుని తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.  (ప్రతీకాత్మక చిత్రం)

వారి దెబ్బలు భరించలేక అతడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులకు మెలకువ వచ్చింది. జరిగిందేంటో గ్రహించి వెంటనే వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. స్థానికులు వారిని అడ్డుకుని తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)

హత్య చేసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడని పావని ప్రియుడి ఫోన్ తోనే అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. హత్యతో పావని కుటుంబ సభ్యులకు కూడా సంబంధముందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రియుడ్ని ప్రియురాలు హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలే ఆమెను హత్యకు పురిగొల్పినట్లు పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళ్తే మలకపల్లికి చెందిన గుర్సికూటి పావని., గతంలో తాడేపల్లిగూడెంలో కొన్నాళ్లు నివాసం ఉంది. ఈ క్రమంలో అంబటి కరుణ తాతాజీ నాయుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇటీవల మళ్లీ మాటలు కలిశాయి. దీంతో ఇద్దరూ కొవ్వూరు మండలం, కాపవరం- ధర్మవరం మార్గంలో కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం తనను మలకపల్లిలో దించాలని పావని.., తాతాజీని కోరింది. అతడు బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలోనే తనతో తెచ్చుకున్న కత్తితో పావని వీపుపై పొడిచింది. అనంతరం అతని మెడ, వీపుపై విచక్షణారహితంగా పొడిచింది. దీంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. పక్కా స్కెచ్ తోనే పావని ఈ మర్డర్ కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

విచారణలో సంచలన విషయాలు

పావని-తాతాజీ రెండేళ్ల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ బయట కలుస్తూనే ఉన్నారు. ఐతే కొన్నాళ్లుగా తనను బహిరంగంగా పెళ్లి చేసుకోవాలని తాతాజీని కోరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయి. ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకున్నారు. దీంతో తాతాజీని ఎలాగైనా అంతమొందించాలని పావని భావించింది. పక్కా ప్లాన్ తో అతడ్ని పిలిచి మర్డర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక పావనిని అపుదులోకి తీసుకున్న పోలీసులు ఆమె హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బ్యాగులో మరో కత్తిని కూడా గుర్తించారు. తాతాజీనీ చంపిన తర్వాత తాను కూడా మరో కత్తితో పొడుచుకొని చనిపోవాలనుకున్నట్లు తెలుస్తోంది.

ప్రియుడి మొబైల్ తోనే తల్లిదండ్రులకు ఫోన్

ఇక హత్య చేసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడని పావని ప్రియుడి ఫోన్ తోనే అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న తల్లిదండ్రులు తాతాజీ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్న సంగతి తమకు తెలియదని.., గతంలో పావని కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి బెదిరించడంతో తమ కుమారుడు ఆమెతో మాట్లాడటం మానేసినట్లు తెలిపారు. ఐతే ఈ హత్యలో పావని కుటుంబ సభ్యులకు కూడా హస్తముందని తాతాజీ తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు వివరించారు. పోలీసులు పావని-తాతాజీ ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Love, Love cheating, Love marriage, Murder, West Godavari

ఉత్తమ కథలు