పెళ్లై వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ బంధాన్ని గౌరవిస్తూ భార్యభర్తలు అన్యోన్యంగా మెలగాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు గీతదాటినా జీవితాలు నాశనమవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. వివాహేతర సంబంధాలు మనిషిని అయివారిని కూడా మట్టుబెట్టేంత వరకు తీసుకెళ్తున్నాయి. తాత్కాలిక సుఖాల కోసం ఏంచేయడానికైనా వెనుకాడకుండా చేస్తున్నాయి. ఇలా ఓ మహిళ సాగించిన వ్యవహారం పచ్చనికాపురంలో చిచ్చుపెట్టింది. ఆమె చేసిన తప్పుకు ఆమెతో పాటు కుటుంబమంతా బలైంది. వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ తాపీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి ఆరేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన సంధ్య అనే యువతితో పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐతే బాగా సంపాదించి జీవితాన్ని మార్చుకోవాలని కలలుగన్న సతీష్ ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో సంధ్య సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఫణీంద్ర అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం సంధ్య అత్తింటివారికి తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. రాజీ కుదుర్చుకున్న అనంతరం కుటుంబ పెద్దలు పిల్లలను తమ దగ్గర ఉంచుకొని సంధ్యను పుట్టింటికి పంపేశారు. ఇటీవల సతీష్ సౌదీ నుంచి ఇంటికి వచ్చాడు. విషయం తెలిసి బాగా కుంగిపోయాడు. భార్య చేసిన పనిని తలుచుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. అతడ్ని ఓదార్చిన తల్లిదండ్రులు సతీష్ ను పిల్లలతో సహా కేశవదాసు పాలెంకు పంపారు.
ఐతే జరిగిన విషయంపై భార్యతో మాట్లాడాలని నిర్ణయించుకున్న సతీష్... ఆమె పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివలలోని మేనమామ ఇంటి వద్ద ఉందని తెలిసుకొని అక్కడికి వెళ్లాడాడు. అక్కడ రెండురోజుల ఉన్న తర్వాత శుక్రవారం రాత్రి సమయంలో చించికినాడ వంతెనపైకి వెళ్లి భార్యపిల్లలతో సహా గోదావరిలో దూకేశారు. వంతెన వద్ద బైక్ పై పిల్లల దుస్తులు, సూసైడ్ నోట్ ఉంచారు.
సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు
బ్రిడ్జి వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ లో సంధ్య సంచలన విషయాలు రాసింది. తనను ఫణీంద్ర అనే వ్యక్తి మోసం చేశాడని.. తనకు ట్యాబ్లెట్లు ఇచ్చి డబ్బు, బంగారం కాజేశాడని రాసింది. అతడితో పాటు మరికొంద మంది వ్యక్తులు వేధింపులకు గురిచేసినట్లు పేర్కొంది. తమ ఆత్మహత్యకు అతడే కారణమని అందులో రాసింది. మరోవైపు ఎలాంటి వివాదాలు లేకుండా సౌమ్యంగా ఉండే సతీష్ కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకోవాడనికి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.