‘హాలో సార్.. మా ఇంట్లో పాము దూరింది’... అర్ధరాత్రి సీఎంకు ఫోన్...

అర్ధరాత్రి ఫోన్ దూరిందని ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన యువకుడు... సానుకూలంగా స్పందించిన పుదుచ్చేరి సీఎం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 4:46 PM IST
‘హాలో సార్.. మా ఇంట్లో పాము దూరింది’... అర్ధరాత్రి సీఎంకు ఫోన్...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 4:46 PM IST
ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఫోన్ చేసి... ‘మా ఇంట్లో పాము దూరింది సార్... సాయం చేయండి’ అని అడిగాడో సామాన్యుడు. అది మామూలు సమయంలో కాదు... అర్ధరాత్రి. అయితే సామాన్యుడి ఫోన్‌కాల్‌కి ఎంతో ఓపికగా స్పందించి, అందరి మనసుల్నీ దోచుకున్నాడా ముఖ్యమంత్రి. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే... పుదుచ్చేరిలో! పుదుచ్చేరిలోని అరియాం కుప్పువ ప్రాంతంలో రాజా అనే వ్యాపారి... భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి రాజా బయటకు వెళ్లగా... అతని భార్య విజయ, పిల్లలతో కలిసి నిద్రపోయింది. అర్ధరాత్రి సమయంలో కిచెన్‌లో నుంచి చప్పుడు కావడంతో లేచి చూసింది.

లైట్ వేసి చూడగా అయిదు అడుగుల నల్లతాచు కనిపించింది. పామును చూడగానే భయంతో పిల్లలను లేచి, చుట్టుపక్కల వారిని కేకలేసి పిలిచిందామె. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఏం చేయాలో తెలియక భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. రాజా కొడుకు వసంత్, పోలీసులకు ఫోన్ చేసి సాయం చేయమని కోరాడు. వాళ్లు పాములు పట్టుకోవడం తమ డ్యూటీ కాదని, అటవీశాఖ అధికారులకు ఫోన్ చేయాలని ఓ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తీయలేదు. దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ డైరీ తీసుకుని అధికారులకు సమాచారం ఇద్దామనుకున్నాడు. వెంటనే డైరీ తీసుకుని అందులో మొదట ఉన్న ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామికి ఫోన్ చేశాడు. అర్ధరాత్రి పూట కాల్ చేస్తే తిడతాడమోననే భయంతోనే... ఫోన్ మాట్లాడాడు. అర్ధరాత్రి ఫోన్ ఎత్తిన ముఖ్యమంత్రికి తన గోడు వెల్లడించాడు. ‘మా ఇంట్లోకి పాము దూరింది సార్.. భయంతో పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేయమన్నారు. వాళ్లే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు... మీరే సాయం చేయాలి’ అని అభ్యర్థించాడు వసంత్.

దానికి సానుకూలంగా స్పందించిన సీఎం... ‘భయపడకండి... వెంటనే పామును పట్టుకునేందుకు మనుషులను పంపిస్తాను’ అని చెప్పి భరోసా ఇచ్చాడు. సీఎం ఫోన్ పెట్టేసిన కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు అటవీ శాఖ అధికారులకు రాజా ఇంటికి వచ్చి... పామును పట్టుకున్నారు. మర్నాడు ఉదయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాము పుట్టలను తొలగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...