Home /News /crime /

HELICOPTER FELL IN ARABIAN SEA NEAR MUMBAI 4 INCLUDING 3 EMPLOYEES DIED PVN

Helicopter Fell In Sea : సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్..నలుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తీరం నుంచి సముద్రం మధ్యలోని రిగ్​పై హెలికాప్టర్ ల్యాండ్​ కావాల్సి ఉంది. అయితే దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో సాంకేతిక సమస్య కారణంగా ఫ్లోటర్ల ద్వారా అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.

అరేబియా సముద్రంలో(Arabian Sea) ఓ హెలికాప్టర్​(Helicopter) కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఓన్‌జీసీ(ONGC) అధికారులు కాగా, మరొకరు కాంట్రాక్ట్ ఉద్యోగి అని తెలుస్తోంది. ముంబై(Mumbai) తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికిన చర్యలు చేపట్టారు.

మంగళవారం ONGC (ఆయిల్​ అండ్​ నేచురల్​ గ్యాస్​ కార్పొరేషన్​)కి చెందిన ఓ హెలికాప్టర్​ అరేబియా సముద్రంలో ఉన్న సైట్ వద్దకు బయలు దేరింది. తీరం నుంచి సముద్రం మధ్యలోని రిగ్​పై హెలికాప్టర్ ల్యాండ్​ కావాల్సి ఉంది. అయితే దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో సాంకేతిక సమస్య కారణంగా ఫ్లోటర్ల ద్వారా అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ఆరుగురు ఓన్‌జీసీ అధికారులు,ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఇద్దరు పైలట్లు కలిపి మొత్తం తొమ్మది మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందిన వెంటనే దగ్గరలోని కోస్ట్‌గార్డ్ షిప్ ఘటనా స్థలానికి చేరుకుందని, మరో షిప్ ముంబై తీరం నుంచి బయలుదేరినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపింది.

సముద్రంలో హెలికాఫ్టర్ కూలిన తర్వాత కొద్దిసేపటికి హెలికాప్టర్ అటాచ్ చేసిన ఫ్లోటర్స్ సహాయంతో కొంత సమయం పాటు తేలుతూనే ఉండిపోవడం.. హెలికాఫ్టర్ లోని మొత్తం తొమ్మిది మందిని బయటకు తీయడంలో రక్షకులకు(రెస్క్యూ టీమ్స్) సహాయపడిందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. వారిలో నలుగురు అపస్మారక స్థితిలో ఉండటంతో వారిని నేవీ చాపర్‌లో ముంబైలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారని అధికారి తెలిపారు.

OMG : బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేయలేదని..ప్రైవేట్ పార్ట్ లో 12 అంగుళాల టార్చ్ తోశారు

మరోవైపు,సోమవారం అర్థరాత్రి ముంబై(Mumbai)లోని కుర్లా ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి ఎనిమిది మంది సజీవంగా బయటకు తీశారు. ఆ తర్వాత వారిని హాస్పిటల్ కి తరలించగా..అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఆదిత్య ఠాక్రే సందర్శించారు.  ఘటన జరిగిన కాలనీలో నాలుగు శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నాయని, స్థానిక కార్పొరేటర్ ప్రవీణ మొరాజ్‌కర్ తెలిపారు. ఆరేళ్ల క్రితమే తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆ బిల్డింగ్ లో ఉన్నవాళ్లకు నోటీసులు ఇని ఇవ్వబడ్డాయని. అయినప్పటికీ, అందులో నివాసం కొనసాగిస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Helicopter, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు