యువకుడి కొట్టి చంపారు...తండ్రిని సూసైడ్ చేసుకునేలా చేశారు..

ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని మనస్థాపానికి గురైన రత్తిరామ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి తనువు చాలించుకున్నాడు.

news18-telugu
Updated: August 16, 2019, 4:09 PM IST
యువకుడి కొట్టి చంపారు...తండ్రిని సూసైడ్ చేసుకునేలా చేశారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొడుకును దుండగులు దారుణంగా హతమార్చారు. పది మంది కలిసి నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఆ ఘటనతో తండ్రి షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. బాధితులకు న్యాయం చేయకుండా హంతకులకే కొమ్ముకాశారు. అంతేకాదు చంపేస్తామంటూ నిందితులు బెదిరించడంతో...దిక్కుతోచని స్థితిలో మృతుడి తండ్రి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నెల రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు చనిపోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

భివాండికి చెందిన రత్తిరామ్ జాతవ్ అంధుడు. అతడికి హరీష్ జాతవ్, దినేష్ జాతవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిది దళిత సామాజికవర్గానికి చెందిన కుటుంబం. గత నెలలో హరీష్ ఫల్సా గ్రామంలో రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. బైక్‌తో ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దాంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు హరీష్‌పై దాడికి పాల్పడ్డారు. పది పదిహేను మంది కలిసి అతడిని చితకబదారు. తీవ్రగాయాలపాలైన హరీష్ ఢిల్లీలో చికిత్సపొందుతూ మరణించాడు. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడికి కాకుండా హంతకులకు వంతపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

మరోవైపు నిందితుల నుంచి హరీష్ తండ్రి రత్తిరామ్‌కు బెదిరింపులు మొదలయ్యాయి. కేసు ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని మనస్థాపానికి గురైన రత్తిరామ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి తనువు చాలించుకున్నాడు. రత్తిరామ్ సూసైడ్‌పై అతడి రెండో కుమారుడు దినేష్ దళిత నాయకులతో కలిసి ఉన్నతాధికారులుకు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో హరీష్ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబానికి జిల్లా అధికారులు రూ.4,12,000 పరిహారం అందించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు