• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HEART TOUCHING INCIDENT IN MUMBAI A MOTHER SPEND FULL NIGHT BESIDE SON DEAD BODY BY THINKING HE WAS ALIVE HSN

కొడుకు బతికే ఉన్నాడని ఆ తల్లి అనుకుంది.. గాయాలకు పసుపు పూసి రాత్రంతా పక్కనే పడుకుంది.. కానీ..

కొడుకు బతికే ఉన్నాడని ఆ తల్లి అనుకుంది.. గాయాలకు పసుపు పూసి రాత్రంతా పక్కనే పడుకుంది.. కానీ..

ప్రతీకాత్మక చిత్రం

గాయాలపాలయి అక్కడికక్కడే మరణించిన కొడుకు, ఇంకా బతికే ఉన్నాడనుకుందామె. ఆ కొడుకును మంచంపై పడుకోబెట్టి గాయాలకు పసుపు రాసింది. రాత్రంతా కొడుకు పక్కనే పడుకుని అతడిని ఓ కంట కనిపెట్టుకుని ఉంది. ఆ తర్వాత..

  • Share this:
    కన్న కొడుకు మరణించాడని తెలిస్తే ఏ తల్లి గుండె అయినా తల్లడిల్లక మానదు. తన కొడుకు మరణించాడన్న నిజాన్ని ఆ తల్లి మనసు అంగీకరించదు. అందుకే సృష్టిలో తల్లిప్రేమకు, ఆమె పంచే ఆప్యాయతకు ప్రత్యామ్నాయం ఉండదు. తాజాగా ఓ తల్లీకొడుకు విషయంలో జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. గాయాలపాలయి అక్కడికక్కడే మరణించిన కొడుకు, ఇంకా బతికే ఉన్నాడనుకుందామె. ఆ కొడుకును మంచంపై పడుకోబెట్టి గాయాలకు పసుపు రాసింది. రాత్రంతా కొడుకు పక్కనే పడుకుని అతడిని ఓ కంట కనిపెట్టుకుని ఉంది. తెల్లారిన తర్వాత కూడా కొడుకు లేవకపోవడంతో బంధువులకు ఫోన్ చేసింది. వాళ్లు వచ్చి చూస్తే, అసలు నిజం తెలిసింది. చనిపోయిన కుమారుడిని పక్కనే ఉంచుకుని రాత్రంతా నిరీక్షించిన ఆ తల్లి ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    మేఘాలయకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని ముంబైకి వలస వచ్చింది. ముంబై నగరంలోని కలీనా ప్రాంతంలో ఆ కుటుంబం ఉంటోంది. 70 ఏళ్ల తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాల్లో ఆమె కుటుంబం కూడా ఉంది. సోమవారం సాయంత్రం 42 ఏళ్ల చిన్న కొడుకు బాత్రూంలో కాలు జారి పడ్డాడు. అక్కడికక్కడే మరణించాడు. బాత్రూంలో కొడుకు పడిపోయిన కొడుకును ఆ తల్లి కష్టపడి ఇంట్లోకి తెచ్చింది. ఇంట్లోనే మంచంపై పడుకోబెట్టింది. ఆమె పెద్ద కొడుకు కూడా అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడు. పెద్ద కొడుకు మంచం పక్కనే చనిపోయిన చిన్న కొడుకును పడుకోబెట్టింది. తలకు తగిలిన గాయాలకు పసుపు రాసింది. ఆ తర్వాత ఆ మంచం పక్కనే చాప వేసుకుని రాత్రంతా అక్కడే నిరీక్షించింది.
    ఇది కూడా చదవండి: గుంటూరులో డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!

    మధ్యలో లేచి మంచినీళ్లు అడుగుతాడేమో, ఆకలిగా ఉందని అడుగుతాడేమోనని పక్కనే ఆహార పదార్థాలను కూడా ఉంచుకుంది. అయితే రాత్రంతా నిరీక్షించిన కొడుకు లేవకపోవడంతో ఆమె భయపడిపోయింది. ’చిన్నోడికి ఒంట్లో బాలేదు. నిన్న సాయంత్రం బాత్రూంలో పడిపోయాడు. గాయాలకు పసుపు రాశాను. ఇంకా లేవడం లేదు. ఆస్పత్రికి తీసుకెళ్లాలి. భయం వేస్తోంది‘ అంటూ స్థానికంగా ఉన్న బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో బంధువులు పోలీసులకు, అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పోలీసులు అక్కడ ఏం జరిగిందో గ్రహించి ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
    ఇది కూడా చదవండి: ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు