హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మునగనూరులో కన్నబిడ్డే తల్లిని చంపిన కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులు కీర్తి రెడ్డి, శశి కుమార్ కలిసి రజితను ఎలా హత్య చేశారు? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? తదితర వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. కీర్తి రెడ్డిపై బాల్‌రెడ్డి అత్యాచారం.. అనంతరం అబార్షన్ కోసం శశికుమార్ సాయం తీసుకోవడం.. అతడు బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు కావాలని వేధించడం.. తదితర విషయాలను తెలిపారు. అయితే, కీర్తికి మహబూబ్‌నగర్‌లోని ఆమనగల్ పద్మ నర్సింగ్ హోమ్‌లో అబార్షన్ చేయించిన విషయం బయటికి తెలియడంతో.. ఆ ఆస్పత్రిపై రంగారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి అబార్షన్ చేసినందుకు గానూ రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి హాస్పిటల్‌ను సీజ్ చేశారు. ఆ ఆస్పత్రిని హేమ్‌లాల్ అనే వైద్యుడు నడుపుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.