విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించి మసాజ్‌లు...హెడ్‌మాస్టర్ వికృత చేష్టలు

విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించి మసాజ్‌ చేయించుకుంటున్న హెడ్ మాస్టర్‌ను తల్లిదండ్రులు చితకబాదారు.

news18-telugu
Updated: February 25, 2020, 4:45 PM IST
విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించి మసాజ్‌లు...హెడ్‌మాస్టర్ వికృత చేష్టలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పాఠాలు చెప్పాల్సిన ఆయన మాస్టారు ఎవరూ చెప్పుకోలేని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మనవరాలి వయసున్న విద్యార్థినులతో మసాజ్ చేయించుకోవడం, వారికి నీలిచిత్రాలు చూపించడం, అసభ్యంగా ప్రవర్తించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. పలువురు విద్యార్థినులు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో... ప్రధానోపాధ్యాయుడి వికృత చేష్టల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా రాజుపాలెంట మండల గణపవరం జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు చేసిన నిర్వాహకమింది.

కొంతకాలంగా హెడ్ మాస్టర్ చేసిన ఈ రకమైన చర్యలతో విసిగిపోయిన విద్యార్థినులు... జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి వెంకటేశ్వరరావును చితకబాదారు. పోలీసులకు ఫోన్ చేసి అతడిని వారికి అప్పగించారు. అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఎంవో... వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంఈవో వెల్లడించారు.


First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు