కొందరు పెళ్లైన తర్వాత.. కూడా భార్యల పట్ల (Harassment) అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. భార్యలను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసి పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి వేధింపుల ఘటన తరచుగా వార్లలో ఉంటున్నాయి. కాగా, తన భర్తకు నలుగురు భార్యలు ఉన్నారనీ, గత 11 ఏళ్లుగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని.. ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చిత్ర హింసలకు గురిచేస్తున్న భర్త కూడా ఓ పోలీసు అనీ, ఆయన నలుగురు భార్యలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొనడం కలకలంగా మారింది.
కర్ణాటకలో (Karnataka) కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేస్తున్న ఒక పోలీసు బాగోతం బయటపడింది. ఇతని వేధింపును భరించలేక భార్య పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రత్యేక బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ పీఎం బాబుపై, అతని భార్య ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారని తెలిపింది.
ఆయన తనను 11 సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఇప్పటికే ఎన్నోసార్లు భర్తకు నచ్చచేప్పి చూశానని, తన పెద్దలతో కూడా చెప్పించాని అయిన , తన భర్తలో మార్పు రాలేదని ఆమె ఆవేదన చెందింది. ఈ క్రమంలో వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్ వచ్చానని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ప్రాధేయ పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
గుజరాత్ లో (Gujarat) దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చింది.
నవ్ సారి జిల్లాకు చెందిన ఒక యువతి, కొయంబత్తురుకు చెందిన రాజు పటేల్ కి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి (Affair) దారితీసింది. ఈ క్రమంలో.. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య గొడవలు జరగటంతో రాజు పటేల్ ను యువతి దూరంగా పెట్టింది. దీంతో అతను కోపంతో రగిలిపోయాడు. కాగా, మింధబారి నగరంలో సదరు యువతి చెల్లెలి పెళ్లి (Marriage) నిశ్చమైంది. యువతి పెళ్లి.. లతేష్ అనే వ్యక్తితో జరిగింది. కాగా, వీరి పెళ్లికి రాజు పటేల్ కూడా వచ్చాడు.
పెళ్లి తర్వాత.. గిఫ్ట్ లు (Gift Explosion) ఓపేన్ చేసి చూస్తున్నారు. యువతి,మేనల్లుడు జియాన్ కొత్త జంటలకు వచ్చిన బహుమతులను సరదాగా తెరుస్తున్నాడు. ఒక గిఫ్ట్ లో అతను బొమ్మను చూశాడు. దాని రీచార్జ్ చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అది ఒక్కసారిగా పేలింది. దీంతో జియాన్, లతేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతని తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు కాసేపటికి పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. బహుమతి కవర్ ను రాజు పటేల్ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ యువతి పై కోపంతోనే చెల్లెలి పెళ్లిలో ఇలా చేసుంటాడని భావిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.