మా ఆయన నాపై మూత్రం పోస్తున్నారు.. సీనియర్ అధికారిపై ప్రధానికి మహిళ లేఖ

బాబూరామ్ నిషాద్ యూపీ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

news18-telugu
Updated: September 28, 2019, 3:08 PM IST
మా ఆయన నాపై మూత్రం పోస్తున్నారు.. సీనియర్ అధికారిపై ప్రధానికి మహిళ లేఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి భార్య, తన భర్తపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసింది. తన భర్త తనను అత్యంత దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించింది. బాబూరామ్ నిషాద్ అనే ప్రభుత్వ ఉద్యోగి యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిస్థాయి పదవిలో పనిచేస్తున్నారు. ఆయన భార్య నీతు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. తనపై జరుగుతున్న గృహహింసను ఆమె వివరించారు. ఆ ఫేస్ బుక్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. ‘నా భర్త నన్ను భయంకరంగా కొడుతున్నారు. చంపేస్తానని బెదిరిస్తున్నారు. గన్‌ కూడా చూపించి చంపేస్తానని బెదిరించారు. నా మీద మూత్రం కూడా పోశారు. నన్నే కాదు. మా అమ్మానాన్నలను, సోదరులను కూడా చంపేస్తానని బెదిరిస్తున్నారు. మా ఆయన ఓ మంత్రి. అయినా కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. పోలీసు అధికారులతో కూడా మా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. వివాదాన్ని వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇవే కాకుండా నా భర్త నన్ను కొడుతున్నారు.’ అని రాశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించి విఫలం అయ్యానని, ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.

First published: September 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>