సగం మనిషి, సగం కుక్క... అతను మాములు మనిషి కాదు... డాక్టర్లు కూడా...

రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దాడి చేసి కరిచేసిన యువకుడు... సీసీటీవీ ఆధారంగా యువకుడి అరెస్ట్... మానసిక రుగ్మత కారణంగా తనను తాను కుక్కగా భావిస్తున్నాడని నిర్ధారించిన డాక్టర్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 31, 2019, 4:11 PM IST
సగం మనిషి, సగం కుక్క... అతను మాములు మనిషి కాదు... డాక్టర్లు కూడా...
సగం మనిషి, సగం కుక్క... డాక్టర్లు కూడా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 31, 2019, 4:11 PM IST
అతను మామూలు మనిషి కాదు, అలాగని జంతువు కాదు. సగం మనిషి, సగం కుక్క... అవును డాక్టర్లు కూడా అతన్ని పరీక్షించే మనోడిలో సగం మనిషి, సగం జంతువు లక్షణాలు ఉన్నాయని తేల్చేశారు. 2001లో వచ్చిన ‘ది యానిమల్’ అనే హాలీవుడ్ సినిమా చూసినవారికి మనుషుల్లో జంతు లక్షణాలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో గురించి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో హీరో రాబ్ ఎస‌్చెనిదర్ ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడతాడు. అతన్ని కాపాడిన ఓ డాక్టర్... ప్రమాదంలో పాడైపోయిన రాబ్ శరీరభాగాలను తీసి, జంతువుల శరీర భాగాలు అమరుస్తాడు. చూడడానికి సాధారణ మనిషిలాగే ఉన్నా... జంతువులను చూడగానే అతనిలో ఉన్న జంతు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ సినిమా వరకు పరిమితమైనా... తాజాగా ఓ మనిషిలో జంతు లక్షణాలు ఉన్నాయని తేల్చారు డాక్టర్లు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి, రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో పాటు కుక్క కరిచినట్టుగా కండ పీకేసి పారిపోయాడు.

అతని ప్రవర్తనను గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, సీసీటీవీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేశారు. యువకులపై దాడి చేసింది 22 ఏళ్ల హార్‌ఆఫ్ అనే యువకుడని తేల్చి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ప్రవర్తన వింతగా అనిపించడంతో మానసిక వైద్యులతో పాటు డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించారు. ఇందులో హార్‌ఆఫ్‌కు వింత జబ్బు ఉందని తేలింది. ఈ మానసిక రుగ్మత కారణంగా హార్ఆఫ్ తనను తాను కుక్కగా భావిస్తున్నాడు. కుక్కలాగే కాలు ఎత్తి, గోడల మీద, వాహనాల మీద టాయిలెట్ చేస్తున్నాడు. కొత్తవారు కనిపిస్తే... మొరుగుతున్నాడు. అనుమానం కలిగితే దాడి చేసి, కుక్కలా కొరికేస్తున్నాడు. అయితే ఇంతకుముందు హార్‌ఆఫ్ ఓ యూనివర్సిటీలో ఉన్నతవిద్య అభ్యసించాడని, అప్పుడు అతనిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించలేదని స్నేహితులు చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత మానసిక ఒత్తిడి భరించలేకపోవడం, తన భార్య తనకంటే తన పెంపుడు కుక్కకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో హార్ఆఫ్‌లో ఇలాంటి రుగ్మత వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు సైకాలజిస్టులు.

First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...