• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • HE HARASSED 370 WOMEN BY MAKING OBSCENE WHATSAPP CALLS VB

WhatsApp Video Call: మహిళలకు అసభ్యకర వీడియో కాల్.. వాటిని రికార్డ్ చేసి.. 370 మంది మహిళలకు..

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp Video Call: వాట్సాప్ లో అసభ్యకరంగా వీడియో కాల్ చేస్తూ మహిళలను వేధించే కీచకుడిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉ‍త్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

  • Share this:
    అతడి ఫోన్ కీ ప్యాడ్ లో ఇష్టం వచ్చిన పది నంబర్లను టైప్ చేసేవాడు. ఆ నంబర్లను ట్రూకాలర్ లో చెక్ చేసి అమ్మాయిల నంబర్లు అయితే తిరిగి వాట్సాప్ కాల్ చేసేవాడు. ఆ వాట్సాప్ కాల్ ను వీడియో రికార్డింగ్ మోడ్ లో ఉంచి అతడు దుస్తులు విప్పేవాడు. ఇది గుర్తించిన మహిళలు కాల్‌ కట్‌ చేసేవాళ్లు. ఆ వీడియోను రికార్టు చేసి తిరిగి తన మొబైల్ కు పంపించేవాడు. ఇలా వాళ్లను వేధించేవాడు. పోలీసులకు చెబితే కుటుంబసభ్యులకు ఈ వీడియోను పంపుతానని బెదిరించేవాడు. ఇలా వారు భయపడిపోయేవారు. కొంతమంది తమ నంబర్లను మార్చేసేవారు. కొంతమంది అతడు చెప్పిన విధంగా నడుచుకునేవారు. ఇలా సుమారు 370 మంది మహిళలకు అభస్యకరమైన రీతిలో వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ వేధించాడు. చివరకు పోలీసులు సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా అతడిని పట్టుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

    ఉ‍త్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన 35 ఏళ్ల శివ కుమార్‌ వర్మ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. అతడు ఏడు ఫోన్లను కొత్తవి తీసుకున్నాడు. మహిళలను వేధించటానికే వీటిని వాడేవాడు. ప్రతీ ఫోన్‌లో ఓ కొత్త నంబర్‌ వాడి, మహిళలకు కాల్‌ చేసేవాడు. అనంతరం ఆ సిమ్‌ పనిచేయకుండా చేసేవాడు. సెల్‌ ఫోన్‌ కీ ప్యాడ్‌పై ఇష్టం వచ్చినట్లు ఓ పది నంబర్లు టైపు చేసేవాడు. ఆ నంబర్‌ను ట్రూ కాలర్‌లో చెక్‌ చేసుకునేవాడు. అది మహిళ నంబర్‌ అయితే ఆ పేరుతో సేవ్‌ చేసుకునేవాడు. అనంతరం వారికి వాట్సాప్‌ కాల్‌ చేసేవాడు. వాట్సాప్‌ కాల్‌ను.. వీడియో స్క్రీన్‌ రికార్డు మోడ్‌లో ఉంచి, దుస్తులు విప్పేవాడు.

    ఇది గుర్తించిన మహిళలు కాల్‌ కట్‌ చేసేవాళ్లు. ఇలా కాల్‌ కట్‌ చేసిన వాళ్లను మళ్లీ వేధించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే తన వద్ద ఉన్న స్క్రీన్‌ రికార్డింగులను భర్తకు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి భయపడేవారు. కొంతమంది నంబర్లు మార్చేసేవారు. ఇలా వేధిస్తుండగా ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడికి పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి ప్రవర్తనను పోలీసులు తీవ్రంగా పరిగణించి అతడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.
    Published by:Veera Babu
    First published: