హోమ్ /వార్తలు /crime /

Funny Incident: ఏ బ్రాండ్ మద్యం తాగావ్ నాయనా.. పోలీసులకే చుక్కలు చూపించావ్ గా..

Funny Incident: ఏ బ్రాండ్ మద్యం తాగావ్ నాయనా.. పోలీసులకే చుక్కలు చూపించావ్ గా..

పోలీస్ అధికారులతో తప్పిపోయిన వ్యక్తి

పోలీస్ అధికారులతో తప్పిపోయిన వ్యక్తి

50 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగి కనిపించకుండా పోయాడు. అతను అడవిలో తిరుగుతుండగా.. అతని స్నేహితులు పోలీసులకు మిస్సింగ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు పోలీసులు. అతడిని వెతకడానికి అడవిలోకి వెళ్లిన బృందంలో ఆ వ్యక్తి కూడా ఉన్నట్లు గమనార్హం. ఇలా గంటల తరబడి ఆ పోలీసులతోనే అనకు తాను వెతుకున్నాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ టర్కీలో వైరల్ గా మారింది.

ఇంకా చదవండి ...

50 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగి కనిపించకుండా పోయాడు. అతను అడవిలో తిరుగుతుండగా.. అతని స్నేహితులు పోలీసులకు మిస్సింగ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు పోలీసులు. అతడిని వెతకడానికి అడవిలోకి వెళ్లిన బృందంలో ఆ వ్యక్తి కూడా ఉన్నట్లు గమనార్హం. ఇలా గంటల తరబడి ఆ పోలీసులతోనే అనకు తాను వెతుకున్నాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ టర్కీలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెహాన్ ముట్లు అనే 50 ఏళ్ల టర్కిష్ వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వాళ్లు అక్కడ నుంచి ఇనెగల్ నగరానికి సమీపంలో ఉన్న సయ్యాకా అనే గ్రామీణ ప్రాంతానికి వెళ్లారు. కానీ వాళ్ల స్నేహితులతో వస్తున్న ముట్లు వాళ్లకు కనిపించలేదు.

Alcohol Museum: ఆ మ్యూజియం మొత్తం ఆల్కహాలే.. ఎక్కడ లాంచ్ చేశారో తెలుసా..

అతడు మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అతడికే అర్థం కాలేదు.. వాళ్ల నుంచి తప్పిపోయి అక్కడే ఉన్న అడవిలో తిరిగాడు. కంగారు పడిపోయిన స్నేహితులు స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని.. ఆ వ్యక్తి కోసం అడవిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు అడవి మొత్తం జల్లెడ పట్టారు. కానీ అతడి ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఓ సమయంలో ఆ పోలీస్ బ్యాచ్ లోనే ముట్లు కలిసిపోయాడు. వాళ్లతోనే కొన్ని గంటల పాటు ‘తనకు తాను వెతుక్కున్నాడు’. పోలీస్ బృందంలో అతడే ముట్లు అన్న విషయం గుర్తించలేకపోయారు. ఎవరో గ్రామానికి చెందిన వాడు.. తమకు సహాయం చేస్తున్నాడులే అనుకొని లైట్ తీసుకున్నారు.

చివ‌ర‌కు బెయాన్ ముట్లు ఎక్క‌డున్నావ్‌? అని పోలీసులు గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో అత‌ను ఆశ్చ‌ర్య‌పోయాడు. అప్పుడు తాగిన మైకం అంతా వెళ్లిపోయినట్లు ఉంది.. పోలీసులను ఇలా అడిగాడు. సార్.. మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని.. దానికి పోలీసులు ముట్లు అనే వ్యక్తి ఈ అడవిలో కనిపించకుండా పోయాడు.. అతడి కోసమే అన్నారు. సార్.. మీరు వెతుకున్న ముట్లు నేనే.. నా కోసమే వెతుకుతున్నారు అని అన్నాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లకు ఏం చెప్పాలో.. ఎం చేయాలో అర్థం కాలేదు. తన కోసం కాకుండా మ‌రొక‌రి కోసం గాలిస్తున్నారేమో అనుకున్నాన‌ని ముట్లు చెప్ప‌డంతో పోలీసులు షాక్ అయ్యారు.

Viral Photos: విచిత్రమైన ఫొటోలు.. మీరు చూస్తే కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు..

దీంతో చేసిది లేక అతడిని తన ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. తన స్నేహితులకు ఈ విషయం చెప్పగానే.. వాళ్ల నవ్వులు మామూలుగా లేవు. దీనికి సబంధించి ఓ ఫొటోను ట్విట్టర్ లో వజియేట్ అనే మీడియా సంస్థ పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఘటన అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

First published:

Tags: Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు