Family suicide: భార్య, ఇద్దరి పిల్లలకు ఉరేశాడు.. చివరకు తను కూడా.. అసలేం జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

Family suicide: మేడ్చల్‌ పరిధిలోని నాగారం మునిసిపాలిటీ కేంద్రం కీసరలో దారుణం చోటుచేసుకుంది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా.. భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  అతడు ఓ ఆటో డ్రైవర్. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ గ్రామస్తులు అతడిని ఓ రోజు అతడిపై దాడి చేసి అవమానించారు. తెల్లారి పెద్దల సమక్షంలో కులం పంచాయతీ పెడతామని చెప్పి వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అందులో అతడు అలా ప్రవర్తించినందుకు పంచాయతీ సభ్యులు కూడా రూ.5లక్షలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అతడు ఆటో తీసుకొని వెళ్తుండగా కుటుంబసభ్యలు అతడిని అడ్డుకొని తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా ఆటో అద్దాలను ధ్వంసం చేసి దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు భార్య, ఇద్దరి పిల్లలకు ఉరి పెట్టి తాను కూడా ఉరేసుకొని ఆత్మహ్యత చేసుకున్నారు. ఈ విషాద ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

  యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామానికి చెందిన పల్ల పు భిక్షపతి(36), ఉష(28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు యశ్వంత్‌ (10), అక్షిత(7) ఉన్నారు. భిక్షపతి ఉపాధి కోసం నగర శివారు ప్రాంతానికి వలస వచ్చాడు. ఆటో నడుపుతూ అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగారం మున్సిపాలిటీలోని వెస్ట్ గాంధీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఓ ఇంట్లో ఉన్న యువతి పట్ల భిక్షపతి అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించడంతో.. పాటు ఓ రోజు రాత్రి భిక్షపతిపై దాడి చేశారు. అంతే కాకుండా ఉదయం 8 గంటలకు భిక్షపతి ఆటోలో వెళ్తుండగా అడ్డుకుని మళ్లీ గొడవ పడి కొట్టారు. ఆటో అద్దాలు ధ్వంసం చేశారు. అయితే కులం పంచాయతీ పెట్టి డబ్బులు వసూలు చేయడానికి స్థానికులు పూనుకున్నారు.

  యువతిని వేధించినందుకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అక్కడ నుంచి మనస్థాపం చెందిన భిక్షపతి ఇంటికి వెళ్లి తలుపులు వేశాడు. ఆ తర్వాత ఎంతకూ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లోనికి వెళ్లి చూసి షాక్ తిన్నారు. నలుగురూ చనిపోయి ఉన్నారు. భిక్షపతి ముందు భార్య ఉష, ఇద్దరు పిల్లలు యశ్వంత్‌ (10), అక్షిత(7)లకు ఉరివేసిన అనంతరం భిక్షపతి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. భార్య, ఇద్దరు పిల్లలు మంచంమీద మృతిచెంది ఉండగా.., భిక్షపతి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తనను అవమానించారని, అంతేకాకుండా రూ.5 లక్షలు ఇవ్వాని డిమాండ్‌ చేస్తున్నారని భిక్షపతి సూసైడ్‌ నోట్‌లో వెల్లడించారు.

  అవమానం భరించలేకనే తన భార్య, పిల్లలతో పాటు తానుకూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో పేర్కొన్నాడు. తమ చావుకి కారణం వారే అంటూ భిక్షపతి కొంతమంది పేర్లు ఆ లేఖలో రాసినట్లు తెలిపారు. వారి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారి బంధువులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
  Published by:Veera Babu
  First published: