వాళ్లిద్దరు స్నేహితులు.. ఓ రోజు పొలం పనులకని వెళ్లారు.. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: మూఢనమ్మకాలను నమ్మవద్దని ఎంత చెప్పినా కొంతమంది వాటిని నమ్ముకోవడంతో కొన్ని అనర్థాలు చోటు చసుకుంటున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  చేతబడి పల్లెల్లో భారీగా పెరిగిపోతోంది. అమావాస్య వస్తే చాలు చేతబడి చేసిన వారికి ప్రాణం సృష్తిగా మారుతుందట. ఈ అనుమానాలతో స్వామిల దగ్గరకు వెళ్లి చుయించుకుంటున్నారు ప్రజలు. అక్కడికి వచ్చిన వారికి స్వామీజీలు.. నీకు చేతబడి చేశారని చెప్పడంతో పల్లెల్లో కక్షలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఏదో ఒక గ్రామంలో రోజుకో చోట చేతబడి పేరిట గొడవలు కొనసాగుతున్నాయి. పోలీస్ యంత్రాంగం మూఢనమ్మకాలను నమ్మవద్దని అవగాహన సదస్సులు చేపడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా చేతబడులు ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు. తాజాగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో ఓ వ్యక్తి చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గొడ్డలితో నరికి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ బాలికను నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లారు.. చివరకు..


  పోలీసుల వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన చెలిమెల రమేష్ గౌడ్ అదే గ్రామానికి చెందిన పండరి నాగేందర్ ఇద్దరు కలిసి రోజు కూలి పనికి వెళ్తూ ఉంటారు. వారిద్దరు స్నేహితులు కూడా. ఓ రోజు తమ ఆరోగ్యం సరిగా లేకపోవడం.. దానితో పాటు తమ పశువులు కూడా అనారోగ్యానికి గురి అవుతున్నాయని నాగేందర్ కు అనుమానం వచ్చింది. రమేష్ గౌడ్ చేతబడి చేస్తుండటంతోనే ఇలా జరిగిందని అనుమానించారు. ఈ చేతబడి నేపథ్యంలో నరేందర్ కు విసుగుచెంది రమేష్ గౌడ్ ను ఎలాగైనా సరే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు పకడ్బందీగా ప్లాన్ వేసుకొని రమేష్ గౌడ్ ను చంపడానికి ఎదురు చూశాడు నరేందర్.

  Minor Girl Kidnap: ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు అతడు చేసిన చర్యకు పోలీసులు ఆశ్చర్యపోయారు..


  కానీ ఆరోజు కుదరలేదు. రమేష్ గౌడ్ ఈనెల 8వ తేదీన పోతారం గ్రామ శివారులో చెరువు అవుట్ లో పడిన గడ్డిని పూడ్చే పనిలో ఉన్నారు. అక్కడ రమేష్ గౌడ్ తో పాటు గ్రామానికి చెందిన శ్రీనివాస్, శంకర్ , నాగేందర్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. పని పూర్తి అయినంక అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మద్యం చేసించారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. మొదటక ఆ ప్రదేశం నుంచి శంకర్ మరికొంత మంది వెళ్లిపోయారు. అక్కడ నాగేందర్ ,రమేష్ గౌడ్, శ్రీనివాసులు మిగిలి పోయారు. శ్రీనివాస్ కూడా ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. అతడు కూడా వెళ్లిపోయాడు. చివరకు నాగేందర్, రమేశ్ గౌడ్ లు మాత్రమే మిగిలారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రమేశ్ గౌడ్ పొలం వైపు వెళ్లారు. రమేష్ గౌడ్ తన పొలం బోర్ వద్ద పనిచేస్తుండగా నరేందర్ గొడ్డలితో తలపై కొట్టడంతో అక్కడికి అక్కడికి కుప్పకూలిపోయాడు రమేష్ గౌడ్.

  Romance In Flight: విమానంలో హద్దుమీరిన జంట.. పాడుపని చేస్తూ.. వీడియో వైరల్..


  అతడు అక్కడ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న రైతులు ఈ ఘటనకు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో నాగేందర్ గొడ్డలితో నరికి నట్టు తేలింది. నాగేందర్ ను గజ్వేల్ కోర్టులో హాజరు పరచిన పోలీసులు.. హత్యకు గల కారణాలు చేతబడి చేస్తున్నాడని అనుమానంతో గొడ్డలితో నరికి నట్టు నరేందర్ చెప్పాడు. ఈ విషయాలను పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. గ్రామాల్లో చేతబడి కానీ.. మూఢనమ్మకాలు నమ్మవద్దని చెప్పారు.

  Sexual Health: వయసు పెరిగాక మహిళల్లో శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయి..? పునరుత్తేజం పొందాలంటే ఏం చేయాలి..


  ఇవి సమాజంలో లేవని తెలిపారు. చేతబడి అనేది ఒక మంత్రశక్తి అని.. మనుషుల గోర్లు, జుట్టు సేకరించి ఈ మంత్రప్రయోగం చేసి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపుతారని ఓ విధానం బాగా ప్రచారంలో ఉంది. అయితే మంత్రతంత్రాలు అనేవి లేవని.. వాటి పేరుతో ప్రజలను మోసం చేయడమే కొందరు మోసగాళ్లు పనిగా పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మకూడదని వారు సూచించారు.
  Published by:Veera Babu
  First published: