హాజీపూర్ బావిలో బాధితులు.. ఉరేసుకుంటామంటూ ఆందోళన

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాసరెడ్డి బాలికలను చంపి ఏ బావిలో అయితే పూడ్చాడో ఆ బావిలోనే బాధితులు దిగి మరీ నిరసన తెలుపుతున్నారు. శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

  • Share this:
    అమాయకమైన ఆడపిల్లలను పొట్టనపెట్టుకున్న నరహంతకుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలంటూ హాజీపూర్‌లో బాధిత కుటుంబాలు చేస్తున్న ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. బాధిత కుటంబాలకు చెందిన వారు నిరసనలు ఉధృతం చేశారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి బాలికలను చంపి ఏ బావిలో అయితే పూడ్చాడో ఆ బావిలోనే బాధితులు దిగి మరీ నిరసన తెలుపుతున్నారు. శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డిని ఉరి తీయకపోతే తాము కూడా ఆ బావిలోనే ఆత్మహత్య చేసుకుంటామంటూ కొన్ని రోజులుగా బాధితులు, గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు బావిలోకి దిగి ఆందోళనకు దిగడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామంటూ పోలీసులు వారికి నచ్చజెబుతున్నారు.
    First published: