news18-telugu
Updated: July 30, 2019, 4:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు సక్సెస్ అయ్యారు. అమ్మాయిని క్షేమంగా రక్షించడంతో పాటు... కిడ్నాపర్‌ను కూడా పట్టుకున్నారు. హయాత్ నగర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను హయత్‌నగర్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి జులై 24 బీటెక్ చదువుతున్న సోనిని ఆమె తండ్రిని కారులో తీసుకెళ్లాడు రవిశేఖర్. యువతి చదువుతున్న కాలేజీకి వెళ్లి అక్కడ సర్టిఫికెట్స్ తీసుకున్నారు. భోజనం చేసిన తర్వాత జిరాక్స్ పేపర్స్ కావాలని, వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ కావాలని మళ్లీ హయత్ నగర్ వచ్చారు. తండ్రిని జిరాక్స్ పేపర్స్ తీసుకురావాలని పంపాడు. అనంతరం రవిశేఖర్ కారులో ఉన్న సోనీని తీసుకుని పరారయ్యాడు.
దీంతో ఈ కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి పారిపోయాడు . దీంతో అక్కడ్నుంచి సోనీని క్షేమంగా హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు... సరూర్ నగర్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులకుకూడా కౌన్సిలింగ్ అందించారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
July 30, 2019, 4:08 PM IST