news18-telugu
Updated: July 30, 2019, 8:01 AM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. అమ్మాయిని ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ వదిలి వెళ్లినట్లుగా సమాచారం.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను కారులో రవిశేఖర్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. యువతి ఆచూకీ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. అయితే అద్దంకి బస్టాండ్ లో యువతిని కిడ్నాపర్ రవి శేఖర్ వదిలివెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.
కిడ్నాపర్...వదిలివెళ్లిన ఫోన్ నంబర్ నుండి యువతి తండ్రి, మామయ్యతో ఫోన్లో యువతి మాట్లాడి విషయం తెలియజేసింది. హైదరాబాద్ లో కిడ్నాప్ అనంతరం యువతిని కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకు వెళ్లి అద్దంకి తీసుకు వచ్చి అక్కడ కిడ్నాపర్ రవిశేఖర్ వదిలి వెళ్ళాడు. దీంతో
సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు...అద్దంకి నుండి యువతిని హైదరాబాద్ కు తరలించారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు కిడ్నాపర్ రవి శేఖర్ ఆచూకీ...మాత్రం లభించలేదు.
జులై 24, ఉదయం ఉద్యోగం ఇప్పిస్తానంటూ బీటెక్ చదువుతున్న యువతితో పాటు ఆమె తండ్రిని కారులో తీసుకెళ్లాడు రవిశేఖర్. యువతి చదువుతున్న కాలేజీకి వెళ్లి అక్కడ సర్టిఫికెట్స్ తీసుకున్నారు. భోజనం చేసిన తర్వాత జిరాక్స్ పేపర్స్ కావాలని, వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ కావాలని మళ్లీ హయత్ నగర్ వచ్చారు. తండ్రిని జిరాక్స్ పేపర్స్ తీసుకురావాలని పంపాడు. అనంతరం రవిశేఖర్ కారులో యువతిని తీసుకుని పరారయ్యాడు.
Published by:
Sulthana Begum Shaik
First published:
July 30, 2019, 8:01 AM IST