Hathras Gangrape | హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. 'తల్లే చంపింది'

Hathras GangRape case: యువతితో తమకు స్నేహం ఉండేదని.. అది వారి తల్లిదండ్రులకు నచ్చేది కాదని లేఖలో పేర్కొన్నారు. ఆ కోపంతోనే ఆమెను తీవ్రంగా కొట్టడంతో.. పరిస్థితి విషమించి చనిపోయిందని తెలిపారు.

news18-telugu
Updated: October 9, 2020, 7:29 AM IST
Hathras Gangrape | హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. 'తల్లే చంపింది'
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్  తెరపైకి వచ్చింది. తాము అమాయకులమని.. నలుగురు నిందితులు హాథ్రస్ ఎస్పీకి లేఖ రాశారు. అంతేకాదు మృతురాలి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. తల్లి, సోదరుడే ఆమెను కొట్టి చంపారని.. ఆ నిందను తమపై వేశారని ఆరోపించారు. యువతితో తమకు స్నేహం ఉండేదని.. అది వారి తల్లిదండ్రులకు నచ్చేది కాదని లేఖలో పేర్కొన్నారు నిందితులు. ఆ కోపంతోనే ఆమెను తీవ్రంగా కొట్టడంతో.. పరిస్థితి విషమించి చనిపోయిందని తెలిపారు. అంతేతప్ప తాము గ్యాంగ్ రేప్ చేయలేదు.. దాడి చేయలేదని తెలిపారు.  తమకు అందిన నిందితుల లేఖను అలీగఢ్ జిల్లా జైలర్ ప్రమోద్ కుమార్ సింగ్..  హాథ్రస్ జిల్లా ఎస్సీపి పంపించారు.

''ఆమె మా ఊళ్లోనే ఉండేది. నేను ఆమెతో స్నేహంగా ఉండేవాడిని. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. ఆమె కుటుంబ సభ్యులకు ఇది ఇష్టం లేదు. ఘటన జరిగిన రోజు ఆమెను కలిశాను. తల్లి, సోదరుడు ఉండడంతో ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది. నేను ఇంటికి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఆమెను తల్లి, సోదరుడు తీవ్రంగా కొట్టారని తెలిసింది.'' అని ప్రధాన నిందితుడు సందీప్ లేఖలో పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. సందీప్‌తో పాటు మిగిలిన నిందితులు లవ్‌కుశ్, రవి, రాము కూడా ఆ లేఖపై వేలిముద్రలు వేశారు.

నిందితుల ఆరోపణలను బాధితురాలు తండ్రి కొట్టిపారేశారు. తమ కుమార్తెను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నామని.. ఇప్పుడు నిందితులు తమపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదనం వ్యక్తం చేశారు. వాళ్ల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టంచేశారు. తాము ఎవరికీ భయపడబోమన్న ఆయన... తమకు ఎలాంటి పరిహారం అక్కర్లేదని, న్యాయం మాత్రమే కావాలని కోరుతున్నారు.

కాగా, మృతురాలు, ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌ ఏడాది నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. మృతురాలి సోదరుడి పేరిట ఉన్న నెంబర్ నుంచి సందీప్‌ ఠాకూర్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు, వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురి మధ్య ఇప్పటి వరకు 104 పైగా ఫోన్స్ కాల్స్ జరిగినట్లు కాల్ డిటెయిల్ రిపోర్టులో (CDR) తేలిందని పేర్కొన్నారు. అక్టోబరు 2019 నుంచి మార్చి 2020 మధ్య ఈ కాల్స్‌ను గుర్తించామని.. బాధితురాలి గ్రామమైన బూల్‌గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వచ్చినట్లు తెలిపారు. ఇరువురి ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్.. మొత్తం 104 ఫోన్స కాల్స్ ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి గ్రామానికి చెందిన సందీప్ సింగ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న విషయం తెలిసిందే.

యూపీలోని హత్రాస్‌ జిల్లాలో సెప్టెంబరు 14 20 ఏళ్ల దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదరులతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి నాలుకను కోశారు. మెడను విరిచి గొంతు నులిమారు. అగ్ర కులాలకు చెందిన పలువురు వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను మొదట అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న బాధితురాలు మరణించింది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 7:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading