హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lovers: చివరికి ఇలా చేసి చేతులు దులుపుకోవడానికా ఈమెను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది..

Lovers: చివరికి ఇలా చేసి చేతులు దులుపుకోవడానికా ఈమెను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది..

భార్యతో మహేష్ (ఫైల్ ఫొటో)

భార్యతో మహేష్ (ఫైల్ ఫొటో)

ప్రేమించానన్నాడు. గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడు. కానీ.. పెళ్లయిన నాటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. పోలీసులు అతగాడి కుట్రను బట్టబయలు చేశారు.

ఇంకా చదవండి ...

  హస్సన్: ప్రేమించానన్నాడు. గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడు. కానీ.. పెళ్లయిన నాటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. పోలీసులు అతగాడి కుట్రను బట్టబయలు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నాటకలోని హస్సన్ (Hassan) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అరకలగుడు తాలూకాకు చెందిన యువతిని అక్కలవాడి గ్రామానికి చెందిన మహేష్ ప్రేమించాడు. పెళ్లికి ఆమె కుటుంబం అభ్యంతరం చెప్పడంతో మహేష్ మూడేళ్ల క్రితం సదరు యువతికి గుళ్లో తాళి కట్టి పెళ్లి (Love Marriage) చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుని బెంగళూరులో (Bangalore) పని చేసుకుంటూ అక్కడే కాపురం పెట్టాడు. అయితే.. లాక్‌డౌన్ కారణంగా మహేష్ ఉపాధి కోల్పోవడంతో భార్యతో కలిసి సొంతూరు వచ్చి.. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.

  మహేష్‌ కొన్ని నెలలుగా భార్యతో గొడవ పడటం మొదలుపెట్టాడు. చీటికీమాటికీ గొడవ పడుతుండటంతో భార్యాభర్తలిద్దరికీ పెద్దలు సర్ది చెప్పారు. అయినప్పటికీ మహేష్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. మహేష్ కుటుంబ సభ్యులు కూడా ఆ యువతిని వేధించసాగారు. ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా కట్నం చిల్లిగవ్వ రాలేదని ఆమెను దెప్పిపొడిచారు. పుట్టింటికెళ్లి డబ్బు తీసుకురావాలని ఆమెపై మహేష్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలోనే.. గత మంగళవారం బస్పా-హుళికల్ రోడ్‌లో రాత్రి 8.30 గంటల సమయంలో తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతుండగా ప్రమాదం జరిగిందని.. తనకు కూడా గాయాలయ్యాయని మహేష్ పోలీసులకు చెప్పాడు. తన భార్యను అంబులెన్స్‌లో ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

  ఇది కూడా చదవండి: Shocking: ఏడేళ్ల ప్రేమ... బ్రేకప్ చెప్పి అంబులెన్స్ డ్రైవర్‌కు దగ్గరైన యువతి.. చివరకు ఊహించని ఎండింగ్..

  పోలీసులకు మహేష్ వ్యవహారశైలిపై అనుమానమొచ్చింది. తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బట్టబయలైంది. తన భార్య తలపై పొడిచి తానే హత్య చేసినట్లు మహేష్ ఒప్పుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన చేతులతో తనే చంపిన మహేష్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. పెళ్లయిన నాటి నుంచి తమ కూతురిని వేధించసాగారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమను కాదనుకుని వెళ్లిపోయినప్పటికీ ఎక్కడున్నా కూతురు సుఖంగా ఉందనుకున్నామని.. కానీ ఇలా తమను శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతుందని కలలో కూడా అనుకోలేదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Hassan, Karnataka, Love marriage, Lovers

  ఉత్తమ కథలు