పెళ్ళి కాలేదని నమ్మించి టీచర్‌ను ప్రేమించి.. ఆ తర్వాత..

పవిత్రమైన ఉపాద్యాయ వృత్తికే మచ్చతేచ్చాడు. తోటి ఉపాద్యారాలిని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేశాడు. అతను చేసిన మోసాన్ని భరించలేని ఆమె విషం తాగి బలవన్మరణానికి సాల్పడింది.


Updated: February 15, 2020, 1:39 PM IST
పెళ్ళి కాలేదని నమ్మించి  టీచర్‌ను ప్రేమించి..  ఆ తర్వాత..
teacher-loses-life
  • Share this:
 

పవిత్రమైన ఉసాద్యాయ వృత్తిలో ఉండి తోటి ఉపాద్యారాలిని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేశాడో ప్రబుద్డుడు. అతని చేసిన మోసానికి ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి బలవన్మరణానికి సాల్పడింది. ఈ సంఘటన కర్ణాటకలో రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. ధనంజయ్‌ అనే వ్యక్తి చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో రాణి అనే మరో ఉపాద్యాయురాలు కూడా పనిచేస్తుంది. ఆమెపై కన్నేసిన ధనంజయ్‌ ప్రేమ పేరుతో రాణిని ముగ్గులోకి దింపాడు. అప్పటికే వివాహం అయిన ధనుంజయ్‌ ఆ విషయం ఆమెకు చెప్పకుండా గుట్టుగా ప్రేమ వ్యవహరాన్ని కొనసాగించాడు.

రాణితో సన్నిహితంగా మెలుగుతూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమె దగ్గర నుంచి రూ. లక్షల నగదు తీసుకున్నాడు. ఈ క్రమంలో రాణికి యల్లందూరు ప్రభుత్వ పాఠశాల నుంచి హాసన్‌ జిల్లాలోని మరో పాఠశాలకు బదిలీ అయ్యింది. ఇక ఒంటరి జీవితానికి స్వస్తి పలికి వివాహ జీవితంలోకి అడుగుపెడుదామని ధనుంజయ్‌ని కోరింది. దీనికి అతనిని నుంచి స్పందన లేకపొవడంతో అనుమానం వచ్చిన ఆమె ధనుంజయ్‌ గురించి అరా తీసింది. తన సోదరుడు రాకేశ్‌తో కలిసి అతని వివరాలు సేకరించింది. అతనికి అప్పటికే పెళ్లి జరిగినట్లు తేలుసుకున్న రాణి.. ధనుంజయ్‌ని నిలదీసింది. మోసపోయానని తెలుసుకుని హాసన్‌కు వచ్చేసిన ఆమె తీవ్ర మనస్తాపం చెంది విషం తాగింది. అపస్మారక స్థితి లోకి వెళ్ళిన రాణిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐసీయిలో చికిత్స పోందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు