క్యూలో ఎక్కడెక్కడో అసభ్యంగా తాకిన యువకుడు... చితకబాదిన మహిళ...

ఆసుపత్రి క్యూలో తనను అసభ్యంగా తాకుతూ, వేధించడానికి ప్రయత్నించిన ఆకతాయిని అందరి ముందు చితక్కొట్టిన మహిళ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి వీడియో...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 7:10 PM IST
క్యూలో ఎక్కడెక్కడో అసభ్యంగా తాకిన యువకుడు... చితకబాదిన మహిళ...
యువకుడిని చితకబాదిన మహిళ...
  • Share this:
గుడిలో బడిలో ఆఖరితో ఆసుపత్రిలో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ప్రతీచోటా లైంగిక వేధింపులు ఎదురవుతున్నా... ఆ విషయాన్ని పెద్దగా చేయడం ఇష్టం లేక, చూసీ చూడనట్టు వదిలేస్తారు చాలామంది మహిళలు. అయితే ఓ యువతి మాత్రం అలా వదిలివేయాలని అనుకోలేదు. ఆసుపత్రి క్యూలో తనను అసభ్యంగా తాకుతూ, వేధించడానికి ప్రయత్నించిన ఆకతాయిని అందరి ముందు చితక్కొట్టింది. చుట్టుపక్కల ఉన్నవారు వద్దని, వదిలేయమని చెబుతున్నా వినకుండా యువకుడిని చితకబాది... తగిన బుద్ధి చెప్పింది. ఈ సంఘటనను అక్కడ ఉన్న వారిలో కొందరు మొబైల్‌లో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ ఏరియాలో జరిగింది. ఫతేబాద్ సిటీలో ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వచ్చిందో యువతి. స్కానింగ్ రిపోర్టులు తీసుకునేందుకు క్యూలైన్‌లో నిల్చుంది. మహిళ వెనకాలే నిల్చొన్న ఓ యువకుడు... ఆమెను అసభ్యంగా తాకడం మొదలెట్టాడు. ఎక్కడెక్కడో తాకుతూ లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. ముందుకు జరిగి నిల్చున్నా... అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. దాంతో కావాలనే తాకుతున్నాడని నిర్థారించుకున్న సదరు మహిళ కోపంతో రగిలిపోయింది. యువకుడిని లాగి అందరి ముందు చితకొట్టడం మొదలెట్టింది.

మహిళ ఎదురుతిరగడంతో షాక్‌కు గురైన సదరు యువకుడు... తానేం తప్పు చేయలేదని, క్యూలైన్‌లో ఉండగా చూసుకోకుండా చెయ్యి తగిలి ఉండవచ్చంటూ బుకాయించడం మొదలెట్టాడు. ఆసుపత్రిలో ఉన్న మిగిలినవారు కూడా అతన్ని వదిలేయమని మహిళకు చెప్పడం మొదలెట్టారు. అయితే అవేమీ పట్టించుకోని సదరు మహిళ, యువకుడిని చితకబాదింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading