Home /News /crime /

HARYANA SEVEN INCLUDING 6 MINORS GANG RAPED A 10 YEAR OLD GIRL IN REWARI DISTRICT SU

షాకింగ్.. పదేళ్ల బాలికపై ఏడుగురి అత్యాచారం.. బాలిక తండ్రి వీడియో చూడటంతో వెలుగులోకి.. నిందితుల్లో ఒక్కరు తప్ప..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

10 ఏళ్ల బాలిక‌పై ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నీచమైన చర్య వీడియోను నిందితులు ఒకరికొకరు వాట్సాప్‌లో షేర్ చేసుకున్నారు.

    దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో చోట వారిపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో పరిచయం ఉన్న వ్యక్తులే ఇలాంటి దారుణాలను పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా 10 ఏళ్ల బాలిక‌పై ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరికి 18 ఏళ్లు కాగా, మిగిలిన వారంతా మైనర్లు. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన బాధిత బాలిక తండ్రి దృష్టికి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటన హర్యానా రాంపూరా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాంపూరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక మూడవ తరగతి చదువుతుంది. మే 24న ఆమె ఇంటి సమీపంలో నిర్మించిన పాఠశాలలో ఆడుకుంటుంది. చుట్టుపక్కల పిల్లలు కూడా అక్కడ ఆడుతున్నారు. అయితే కొందరు కలిసి బాలికపై బలవంతంగా సామూహిక అత్యాచారం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా రికార్డు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిందితుల్లో ఒకరికి మాత్రమే 18 ఏళ్లు. మిగిలిన వారి వయసు 8 నుంచి 14 ఏళ్లలోపు మాత్రమే ఉంది.

    ఈ నీచమైన చర్య వీడియోను నిందితులు ఒకరికొకరు వాట్సాప్‌లో షేర్ చేసుకున్నారు. అది కాస్తా బయటకు వచ్చింది. ఈ వీడియోను బాలిక తండ్రి దృష్టికి రావడంతో.. అతడు షాక్ తిన్నాడు. వెంటనే అతడు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు బాధితురాలి కుటుంబానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. మిగిలినవారు కూడా వారి ఇంటికి సమీపంలో నివసించేవారేనని చెప్పారు.

    బీజేపీ నేత కూతురు దారుణ హత్య.. అడవిలో చెట్టుకు వేలాడుతూ మృతదేహం.. కన్ను బయటకు లాగి..

    మైనర్ బాలికతో సహజీవనం.. రక్షణ కోరిన జంట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

    Telangana: పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు.. ఎవరితోనైనా లేచిపో.. సొంత వదినే అలా అనడంతో..

    ఇక, ఈ వీడియో ఎవరి ఫోన్ నుంచి వైరల్ అయింది.. అతడు ఎవరికి షేర్ చేశారనే విషయాల మీద కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన 18 ఏళ్ల వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినట్టుగా పోలీసులు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Haryana, RAPE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు