తాము అడిగింది కాదన్నందుకు కన్నవారినైనా కడతేర్చేందుకు వెనుకడుగు వేయట్లేదు కర్కశులు. నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులను చంపేస్తున్నారు. తాజాగా లింగ మార్పిడి సర్జరీకి డబ్బు ఇవ్వలేదని కుటుంబం మొత్తాన్ని హత్య (murders family) చేశాడు ఒక యువకుడు. ఆగస్టు 23న హర్యానా రోహ్తక్ ప్రాంతానికి చెందిన అభిషేక్ మాలిక్ (20) ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు (police case) గుర్తించారు. నిందితుడి తండ్రి నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి ప్రదీప్ మాలిక్. తండ్రితో సహా తల్లి బాబ్లీ దేవి, బామ్మ రోష్ని దేవితో పాటు సోదరిని సైతం అభిషేక్ తుపాకీతో కాల్చాడు. 17 ఏళ్ల తన సోదరి బుల్లెట్ గాయాలతో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించింది. సెప్టెంబరు 1న అతడిని అరెస్టు (youth arrested) చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
ఇదీ కేసు పూర్వాపరాలు:
ఈ కేసుకు సంబంధించిన వివరాలను రోహత్ డీఎస్పీ గోరఖ్ పాల్ వెల్లడించారు. "అభిషేక్ స్వలింగ సంబంధాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అతడు లింగ మార్పిడి శస్త్రచికిత్స (transgender operation) చేయించుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. డబ్బు ఇవ్వలేదు. ఇక్కడ సమస్య డబ్బు కాదు. ఆ నిర్ణయం వారికి నచ్చలేదు. వారు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొడుకు కూతురిలా మారిపోతానంటే... ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు చెప్పండి. వాళ్లు కూడా కుదరదంటే కుదరదన్నారు.
హత్యలకు కుట్ర:
"కుటుంబ సభ్యుల్ని ఎంతలా అడిగినా పని జరగకపోవడంతో... అభిషేక్‌లో క్రూరమృగం నిద్రలేచింది. 20 రోజులుగా వారి అడ్డు తొలగించుకోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నాడు. ఇంట్లో నుంచి డబ్బు తీసుకున్న తర్వాత విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేసుకున్నాడు. హత్య సమయంలో ఉపయోగించిన పిస్టల్‌ను, మొబైల్ ఫోన్‌ను మేము స్వాధీనం చేసుకున్నాం" అని పాల్ తెలిపారు.
ప్లాన్ అమలు:
నిందితుడు తన తండ్రి స్నేహితుడి నుంచి పిస్టల్ తీసుకున్నాడనీ, దానికి లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల్ని చంపిన తర్వాత అభిషేక్ ఇంట్లో దొంగిలించిన ఆభరణాలను (ornaments theft) స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. నేరం చేశాక పిస్టల్‌ను కాలువలోకి విసిరి స్నేహితుడిని కలుసుకునేందుకు దిల్లీ బైపాస్ దగ్గర్లో ఉన్న హోటల్‌కు నిందితుడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత అతడు తన మేనమామకు ఫోన్ చేసి తల్లిదండ్రులు (parents) కాల్ తీయట్లేదని డ్రామా ఆడాడు. తర్వాత ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారి సాయంతో తన సోదరిని ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఆమె రెండు రోజుల తర్వాత చనిపోయింది. నిందితుడు క్యాబిన్ క్రూ కోర్సు చేశాడు. ఆ సమయంలో ఓ యువకుడితో అతడు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అదే ఈ సమస్యకు కారణమైంది.
ఇది కూడా చదవండి: Video: విరిగిపడిన కొండచరియలు.. ఒక్కక్షణంలో ఒళ్లు గగుర్పొడిచే సీన్!
చివరకు విషాదం:
ఈ కేసులో మగ స్నేహితుడి ప్రమేయం గురించి ఎలాంటి సమాచారమూ అందలేదని, అయినా ఇంకా అతడికి క్లీన్ చీట్ ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఆదివారం రిపోర్టు దాఖలు చేసే సమయంలో నిందితుడి ఇన్స్టాగ్రామ్ (instagram account) ఖాతాలో ఫాలోయర్ల సంఖ్య 700 నుంచి 3259కి పెరిగిందని, అతని పేరుపై ఉన్న మరో ఖాతాలో సెప్టెంబరు 4న ఫాలోయర్ల సంఖ్య 17 వేల నుంచి 18 వేలకు చేరిందని వివరించారు. ఈ అకౌంట్లో అతడు తుపాకీ చేతిలో పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు సడెన్‌గా అంతలా పెరగడానికి కారణం తమకు తెలియదని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Haryana, Haryana police