Home /News /crime /

HARYANA ROHTAK FAMILY MURDER POLICE SAYS SON ADMITS TO KILLING PARENTS SISTER GRANDMOTHER SU

Shocking: ఆనందంగా సాగుతున్న జీవితంలో ఊహించని మలుపు.. అయ్యో పాపం.. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకుని ఉండరు..

ప్రదీప్ కుటుంబం

ప్రదీప్ కుటుంబం

ఆనందంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. ఆ కుటుంబానికి చెందిన నలుగురు(family murder) దారుణ హత్యకు గురయ్యారు.

    ఆనందంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. ఆ కుటుంబానికి చెందిన నలుగురు(family murder) దారుణ హత్యకు గురయ్యారు. అయితే వారిని అంత దారుణంగా ఎవరు చంపారో పోలీసులు విచారణలో తేల్చారు. ఆ కుటుంబంలోని 20 ఏళ్ల యువకుడే.. తల్లిదండ్రులతో పాటుగా, సోదరిని, అమ్మమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ మేరకు ఆ యువకుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలోని(Haryana) రోహ్‌తక్ జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ హత్యలకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రోహ్‌తక్ ఎస్పీ రాహుల్ శర్మ(Rahul Sharma) మీడియాకు వెల్లడించారు.

    హర్యానాలోని రోహ్‌తక్‌‌ జిల్లాలోని(Rohtak District) విజయ్ నగర్ కాలనీలో శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణంగా హత్య చేయబడ్డారు. ప్రాపర్టీ డీలర్ ప్రదీప్ మాలిక్ అలియాస్ బబ్లూ, అతని భార్య బబ్లీ దేవి, అతని అత్త రోషిణి దేవి బుల్లెట్ గాయాలతో చనిపోయారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన ప్రదీప్ కూతురు నేహా మాలిక్ ఆస్పత్రిలో చికిత్సి పొందుతూ తుదిశ్వాస విడిచింది. వీరి మృతదేహాలను ప్రదీప్ ఉంటున్న కాలనీలోనే ఉంటున్న అతని సోదరుడు గుర్తించాడు. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన అనంతరం అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    KRMB Meeting: కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌.. ఏం జరిగిందంటే..

    దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ప్రదీప్ ప్రాపర్టీ డీలర్ కావడంతో.. ఏమైనా ఆస్తి తగాదాలు ఉండవచ్చని తొలుత అనుమానించారు. అయితే పోలీసులకు తర్వాత ప్రదీప్ మాలిక్ కుమారుడు అభిషేక్(19) వైపు మళ్లింది. ఇక, పోలీసులు హత్య జరిగిన కాలనీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. ఇక, అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడు చెప్పిన విషయం విని షాక్ తిన్నారు. అతడే స్వయంగా తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మను చంపినట్టుగా అంగీకరించాడు.

    Hyderabad Pub: పబ్‌లో చిన్నారి డ్యాన్స్.. అలా వెలుగులోకి వచ్చిన వీడియో.. అసలేం జరిగిందంటే..?

    నిందితుడు నేరం చేయడానికి ముందు, చేసిన తర్వాత ఓ హోటల్ రూమ్‌లో తలదాచుకున్నాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. ఆస్తి, కుటుంబ వివాదాల కారణంగా నేరం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. అతని రిమాండ్ సమయంలో కారణాలను నిర్ధారించాల్సి ఉందన్నారు. ఇక, ప్రదీప్ ఇద్దరు పిల్లలు.. కొడుకు అభిషేక్, కూతరు నేహా. అభిషేక్ ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Haryana, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు