కొన్నిసార్లు పోలీసులకు (Police) కూడా అనుకొని సంఘటనలు ఎదురవుతాయి. సామాన్యులు, నేరస్థులు పోలీసులపైనే జులూం ప్రదర్శిస్తారు. అడ్డువచ్చిన అధికారులపై అసభ్యంగా ప్రవర్తిస్తారు. మరికొందరు తమ తప్పులను బయటపెడుతున్నారని పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. దొంగలను, నేరస్థులను పట్టుకునే క్రమంలో పోలీసులు అప్పుడప్పుడు వారి చేతుల్లో దాడులకు గురౌతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. పంజాబ్ లో (Punjab) హర్యానా పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన జలాదాబాద్ (Jaladabad) లో చోటుచేసుకుంది. సోను అనే యువకుడు.. జనవరి 4,2002లో ఒక మహిళను అత్యాచారం (Rape on woman) చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక నిఘా చేపట్టారు. ఈ క్రమంలో అతను పంజాబ్ లో బంధువుల ఇంటిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొంత మంది పోలీసులు సోను ఇంటిలో ప్రవేశించారు. అప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది.
పోలీసులు రావడాన్ని సోను బంధువులు గుర్తించారు. నిందితుడిని అలెర్ట్ చేశారు. అప్పుడు అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. నిందితుడి బంధువులు పోలీసుల మీద దాడిచేశారు. కొందరు పోలీసుల వేళ్లను కొరికారు. మరికొందరు అక్కడి అధికారుల వేళ్లను సైతం కొరికి గాయపర్చారు. నిందితుడి అక్కచెల్లెళ్ల దాడిలో ఒక మహిళా అధికారి యూనిఫామ్ అంతా చిరిగిపోయింది. నిందితుడు పారిపోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కానీ పోలీసులు అతి కష్టంమీద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తప్పని పరిస్థితిలో పోలీసులు.. అదనపు బలగాలను రప్పించారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు.
Woman Raped By Police ..
న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కు వెళ్తే ఆమెకు మరింత అన్యాయమే జరిగింది. సమస్యను తీర్చాల్సిన పోలీస్ ఆమెపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర(Maharashtra)లోని ఠాణెలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ (27) కొద్దికాలం క్రితం ఓ ఫిర్యాదు చేయడం కోసం నవ్ గర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. అయితే అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని ఫ్లాన్ వేశాను. ఇందులో భాగంగా కేసు విషయమై మాట్లాడుతూ సన్నిహతం పెంచుకున్నాడు. తన బాధలు తీరుస్తానని నమ్మించి ఆమెను అనేక చోట్లకు పిలిచేవాడు. కష్టాలు తీరుతాయని నమ్మి వెళ్లిన ఆ మహిళపై ఆ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిందని నవ్ గర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆదివారం కానిస్టేబుల్ ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 376(Rape)కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.