హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: రెచ్చి పోయిన మాఫియా.. అందరు చూస్తుండగానే డీఎస్పీ దారుణ హత్య.. ఎక్కడంటే..

Shocking: రెచ్చి పోయిన మాఫియా.. అందరు చూస్తుండగానే డీఎస్పీ దారుణ హత్య.. ఎక్కడంటే..

సురేంద్ర సింగ్ బిష్నోయ్ (ఫైల్)

సురేంద్ర సింగ్ బిష్నోయ్ (ఫైల్)

Haryana: అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని పోలీసులు సమాచారం అందింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు, తమ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు.

  కొంత మంది దుర్మార్గులు తమ అరాచకాలకు అడ్డువస్తే.. ఎవరిని వదిలిపెట్టరు. సామాన్యులనే కాదు.. పోలీసు అధికారులను కూడా భయ భ్రాంతులకు గురిచేస్తుంటారు. దీంతో కొన్ని సార్లు.. పోలీసులు కూడా వారితో పెట్టుకొవడానికి కాస్త ఆలోచిస్తుంటారు. వారికి కొంత మంది అధికార రాజకీయ నాయకులు, ఇతర పోలీసులు అండగా ఉంటారు. దీంతో వీరి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు.. వీరి అరాచకాలకు అడ్డుకున్న వారిని చంపడానికి కూడా వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

  పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) మైనింగ్ మాఫియా (Mining mafia) బీభత్సాన్ని సృష్టించింది. స్థానికంగా.. ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని నహ్ జిల్లాలో.. పచ్‌గావ్‌లో అక్రమంగా రాళ్లను తవ్వుతున్నట్లు స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. డీఎస్పీ ర్యాంక్ అధికారి సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌.. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసు బృందంతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు సిబ్బందిని గుర్తించిన వెంటనే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. సీనియర్ అధికారి అడ్డుగా నిలబడి రాళ్లతో నిండిన వాహనాలను ఆపమని ఆదేశించారు. అయితే ఓ ట్రక్కు డ్రైవర్.. అధికారి మాటలను ఏమాత్రం లెక్కచేయలేదు. పైగా.. పోలీసుపైనే.. ట్రక్కు ను పొనిచ్చాడు.

  దీంతో.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు పోలీసులు పక్కకు దూకడంతో తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో కాల్పులు జరిపారు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విధినిర్వహణలో చనిపోయిన డీఎస్పీ అధికారికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

  అదే విధంగా నిందితులను ఎట్టి పరిస్థితుల్లోను విడిచిపెట్టమని అన్నారు. ఘటనపై హర్యానా హొమ్ మంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియాను వదిలిపెట్టబోమని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ అన్నారు. నిందితులను వెంటనే పట్టుకొవాలిని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కాగా, దీనిపై హిసార్‌కు చెందిన బీజేపీ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ హత్యను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక సీనియర్‌ పోలీసు అధికారిని ఈ విధంగా హత్య చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఘటనతో ప్రస్తుతం హర్యానాలో తీవ్ర కలకలంగా మారింది.

  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Crime news, Haryana, Haryana police, Murder

  ఉత్తమ కథలు