హోమ్ /వార్తలు /క్రైమ్ /

పోలీసులే గ్యాంగ్ రేప్ చేశారు -ఇద్దరమ్మాయిలతో మసాజ్ కావాలంటూ -అటు ఇటు మార్చుకుంటూ దారుణంగా..

పోలీసులే గ్యాంగ్ రేప్ చేశారు -ఇద్దరమ్మాయిలతో మసాజ్ కావాలంటూ -అటు ఇటు మార్చుకుంటూ దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హెడ్ కానిస్టేబుల్ అనిల్, హోం గార్డు జితేంద్ర, వాళ్ల స్నేహితుడు ధర్మేంద్ర కలిసి యువతులపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. విషయం బయటికి చెబితే ఏదో ఒక కేసులో జైలకు పంపుతామని బెదిరిస్తూ ఇద్దరు యువతులను అటు ఇటు మార్చుకుంటూ రాత్రంతా అతి దారుణంగా పశుత్వాన్ని ప్రదర్శించారు.

ఇంకా చదవండి ...

యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసే సంఘటనలో పోలీసు (Police) సిబ్బందే యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ దురాగతంపై బాధితులు ఎంతో ధైర్యంగా ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదుకు కూడా పోలీసు శాఖ తాత్సారం చేయడం మరింత విస్తుగొలుపుతుంది. నిర్భయ ఘటన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని దేశమంతటా అమలు చేయాలన్న నిబంధన ఉన్నా అక్కడి పోలీసులు మాత్రం దాన్ని ఖాతరు చేయలేదు. యువతులపై పోలీసుల అకృత్యం  (Rape) సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చిన తర్వాతగానీ ఉన్నతాధికారులు కదల్లేదు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ సిబ్బంది, వారి స్నేహితుడైన మరో వ్యక్తి ఎట్టకేలకు అరెస్టయ్యారు. రేవారీ గ్యాంగ్ రేప్ ఉదంతంగా తెరపైకొచ్చిన ఈ దురాగతం హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాలివి..

హర్యానాలోని రేవారీ జిల్లా కేంద్రంలో మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే అనిల్, అదే స్టేషన్ లో హోం గార్డుగా పనిచేస్తోన్న జితేంద్రలకు ఊళ్లోని అన్ని వ్యాపార సముదాయాలతో టచ్ ఉంది. పోలీసులకు సహజంగా లభించే పవర్ ను వీళ్లిద్దరూ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. రేవారీలోని ఓ స్పా సెంటర్ పై చాలా కాలంగా కన్నేసిన ఈ పోలీసులు.. మొన్న గురువారం నాడు మసాజ్ కావాలంటూ అక్కడికెళ్లారు. అయితే, స్పా సెంటర్ లో మసాజ్ చేయించుకోవడం ఎవరైనా చూస్తే బాగోదని, మసాజ్ చేసే ఇద్దరు అమ్మాయిలను వెంట పంపాలని హెడ్ అనిల్ ఆదేశించాడు.

cm kcr : ఇక ఢిల్లీలో దబిడి దిబిడే -ఓపిక పట్టంది చాలు.. గట్టిగా కొట్లాడండి -మోదీ సర్కారును ఎండగట్టండి..అమ్మాయిలను బయటికి పంపడం కుదరదని స్పా ఓనర్ తెగేసి చెప్పడంతో అనిల్ లోని కర్కషపోలీసు ఒక్కసారిగా గర్జించాడు. మాట వినకుంటే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించి, ఆ ఇద్దరు యువతును బలవంతంగా కారెక్కించుకున్నారు. ఊరి శివారులోని లాడ్జికి వెళ్లే దారిలో కామన్ స్నేహితుడైన ధర్మేంద్రను కూడా పిలిచారు. మొత్తం ఐదుగురు కలిసి లాడ్జి గదిలోకి వెళ్లిన తర్వాత ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. అమ్మాయిలు మసాజ్ చేయబోగా వాళ్లు మాత్రం లైంగికవాంఛ తీర్చాల్సిందిగా బలవంతపెట్టారు. యువతులు ఎంతకూ ఒప్పుకోకపోవడంతో..

sex doll : రెండో సెక్స్ డాల్ భార్యతో హనీమూన్ -ఆ దెబ్బకు మొదటి భార్య ఢమాల్ -వీడి ప్లాన్ మామూలుగా లేదు..


హెడ్ కానిస్టేబుల్ అనిల్, హోం గార్డు జితేంద్ర, వాళ్ల స్నేహితుడు ధర్మేంద్ర కలిసి యువతులపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. విషయం బయటికి చెబితే ఏదో ఒక కేసులో జైలకు పంపుతామని బెదిరిస్తూ ఇద్దరు యువతులను అటు ఇటు మార్చుకుంటూ రాత్రంతా అతి దారుణంగా పశుత్వాన్ని ప్రదర్శించారు. శుక్రవారం ఉదయానికి గానీ తిరిగొచ్చిన యువతులు.. జరిగిన ఘోరాన్ని స్పా ఓనర్ తో చెప్పుకుని రోదించారు. ఆ తర్వాత అందరూ ధైర్యం కూడగట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ..

Karimnagar mlc : బండి సంజయ్‌కి ఈటల పోటు.. bjpకి కొత్త అధ్యక్షుడు.. సర్దార్ రవీందర్ సింగ్ ఖేల్ ఖతమంటూపోలీసులపైనే గ్యాంగ్ రేప్ కేసు పెట్టడానికి హర్యానా పోలీసులు వెనుకాడారు. యువతులు చెబుతున్నది నిజమా, కాదా అని నిర్ధారించుకోడానికి వారికి రెండ్రోజుల సమయం పట్టింది. హెడ్ కానిస్టేబుల్ అనిల, హోంగార్డు జితేంద్రలు స్పాకు వెళ్లడం, అక్కణ్నుంచి అమ్మాయిలను బలవంతంగా కారు ఎక్కించుకోవడం, లాడ్జిలోకి వెళ్లారనేందుకు సాక్ష్యాధారాలు లభించడంతో ఎట్టకేలకు కేసు నమోదైంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని,హెడ్ కానిస్టేబుల్‌ అనిల్‌ను సస్పెన్షన్‌లో ఉంచామని, హోంగార్డు జితేంద్రపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశామని రేవారీ డీఎస్పీ మహ్మద్ జమాల్ మీడియాకు తెలిపారు. మద్యం మత్తులోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని డీఎస్పీ పేర్కొన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Gang rape, Haryana, Haryana police

ఉత్తమ కథలు