HARYANA MAN REPEATEDLY RAPES 17 YEAR OLD DAUGHTER FOR 7 YEARS SU
షాకింగ్.. ఏడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. కీచక తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
కన్నకూతరిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కీచకుడి అవతారమెత్తాడు. ఏడేళ్లుగా కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పలు సార్లు అబార్షన్ కూడా చేయించాడు.
కన్నకూతరిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కీచకుడి అవతారమెత్తాడు. ఏడేళ్లుగా కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పలు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. 17 ఏళ్ల బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు.. నిందితుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద పనిచేస్తున్నాడు. అయితే గత ఏడేళ్లుగా తన కూతురిపై అతడు అత్యాచారానికి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితురాలు పలుమార్లు గర్భం దాల్చింది. ఇలా జరిగిన ప్రతిసారి అబార్షన్ చేయించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అయితే ఏడేళ్ల నుంచి నరకాన్ని అనుభవించిన బాధితురాలి.. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది. హిసార్లో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే తన 11 ఏళ్ల చెల్లెలిపై కూడా తండ్రి వేధింపులకు పాల్పడినట్టుగా ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేసింది.
ఆమె ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376(2), 376(2) f, 313, 323, 354-A(1)ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై పొక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. అతడిని విచారస్తున్నామని వెల్లడించారు.
ఇక, ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకంది.తంజవూర్లోని పాపానాశంకు చెందిన నిందితుడు కన్నకూతరిపై అత్యాచారానిపై పాల్పడ్డాడు. ఆమె బిడ్డకు జన్మనివ్వడంతో ఆ కీచకపు తండ్రి బాగోతం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.