Crime News: మహిళ దారుణ హత్య.. రెండు రోజులకు భర్త అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ తర్వాత రెండు రోజులకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు.

  • Share this:
    ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆ తర్వాత రెండు రోజులకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రవీణ్, పాయల్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉణ్నారు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. అయితే ప్రవీణ్.. భార్య క్యారెక్టర్‌పై కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరోకరితో ఎఫైర్‌ పెట్టుకుందని అనుమానించేవాడు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే చివరగా ప్రవీణ్.. పాయల్‌లో అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆ సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రెండు రోజుల తర్వాత ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతనికి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతడికి ఒక రోజు పోలీసు కస్టడీ విధించింది.

    ఈ ఘటనపై అదే ఇంట్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ అన్నయ్య రవీందర్ మాట్లాడుతూ.. ‘సోమవారం రోజున భార్యభర్తల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది చాలా పెద్దదిగా మారింది. కోపంతో ప్రవీణ్.. అతడి భార్యను కత్తితో పొడిచాడు. పలుమార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో పాయల్ సాయం కోసం కేకలు వేసింది. పిల్లలు కూడా ఆ పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. నేను వెళ్లేసరికి పాయల్.. రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాయిం. అయితే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు’అని తెలిపారు.

    ఈ ఘటనపై స్థానిక అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ చంద్ సింగ్ మాట్లాడుతూ.. ప్రవీణ్ నిత్యం అతని భార్యను అనుమానించేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఆమెను హత్య చేశాడని చెప్పారు. ప్రస్తుతం ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: