హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఐటీ కంపెనీలో ఉద్యోగం.. మహిళా సహోద్యోగి టార్చర్.. మేనేజర్ ఏంచేశాడంటే..

ఐటీ కంపెనీలో ఉద్యోగం.. మహిళా సహోద్యోగి టార్చర్.. మేనేజర్ ఏంచేశాడంటే..

అమిత్ కుమార్ (ఫైల్)

అమిత్ కుమార్ (ఫైల్)

Haryana: వ్యక్తి ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మహిళ ఉద్యోగితో వర్క్ విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య ఆఫీస్ లో వాగ్వాదం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కొన్ని కంపెనీలలో ఉద్యోగులను బాస్ లో వేధిస్తుంటారు. సరిగ్గా పని రావడం లేదని, సమయానికి వర్క్ ఫినిష్ చేయలేదని వేధిస్తుంటారు. ఇంకొందరు సరిగ్గా పని నేర్చుకోకుండానే బ్యాక్ డోర్ తో ఏదో ఒక ప్రాజెక్ట్ లో వచ్చి చేరతారు. అయితే.. ఫ్లోర్ మీద సరిగ్గా పని చేయకపోతే.. బాస్ లు, ఏదో ఒక మాట అనడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు.. ఉద్యోగులు దీని వలన ఉద్యోగులు కాస్త ఒత్తిడికి గురౌతుంటారు. వర్క్ ప్లేస్ లో కొందరు తోటి ఉద్యోగులను ఏదో ఒక రకంగా వేధిస్తుంటారు. కొన్నిసార్లు.. దీని వలన ఉద్యోగుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న గురుగ్రామ్ లోని బహుళ జాతి కంపెనీ ఉద్యోగి అమిత్ కుమార్ (40), 4 పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. రవినగర్ కాలనీకి చెందిన అమిత్ కుమార్, సాఫ్ట్ వేర్ కంపెనీలో అసిస్టెంట్ మెనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే.. అతని టీమ్ లో ఒక మహిళ ఉద్యోగితో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాదనలు జరిగాయి.ఈ క్రమంలో.. అతనిపై కొంచెం చెడుగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అతను భరించలేక.. నిన్న రాత్రి ఇంటికి చేరుకున్నాడు.


తన ఆఫీస్ మిత్రులకు, ఇతర స్నేహితులకు తన జీవితాన్ని ముగిస్తున్నట్లు మెసెజ్ లు మెయిల్స్ లు పంపాడు. ఆ తర్వాత.. అతని స్నేహితులు వెంటనే ఇంట్లో వారిని అప్రమత్తం చేశారు. అమిత్ భార్యకు ఫోన్ చేసి చెప్పారు. ఆమె గదిలోకి వెళ్లి చూసేసరికి అతను ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు.
అమిత్ కుమార్ గదిలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించింది. దానిలో మహిళ టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో.. అమిత్ కుమార్ భార్య.. పూజ మెహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు పెళ్లి జరిగి 10 ఏళ్లు గడిచాయని, నెలన్నర రోజుల నుంచి కొత్త కంపెనీలో పనిచేస్తున్నాడని అతని భార్య పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Haryana

ఉత్తమ కథలు