HARYANA GIRL FOUND MURDERED IN WATER TANK PARENTS SUSPECT RAPE SB
సరుకుల కోసం బయటకువెళ్లి.... వాటర్ ట్యాంకులో శవమైన 16ఏళ్ల అమ్మాయి
ప్రతీకాత్మక చిత్రం
ఏప్రిల్ 4తేదీన 16ఏళ్ల రితు సరుకులు తెచ్చుకొనేందుకు బయటకు వెళ్లింది. మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో ఆమెకోసం అక్కడ ఇక్కడ వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించారు.
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. మూడురోజులుగా కనిపించకుండా 16ఏళ్ల వయస్సున్న అమ్మాయి శవమై తేలింది. వాటర్ ట్యాంకులో అమ్మాయి మృతదేహం అనుమానాస్పంద పరిస్థితుల్లో లభ్యమైంది. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం... ఏప్రిల్ 4తేదీన 16ఏళ్ల రితు సరుకులు తెచ్చుకొనేందుకు బయటకు వెళ్లింది. మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో ఆమెకోసం అక్కడ ఇక్కడ వెతికిన తల్లిదండ్రులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించారు. తమ కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. మూడురోజుల తర్వాత గ్రామంలోని వాటర్ ట్యాంకులో రితూ శవమై తేలింది. మృతురాలి ఒంటిపై గాయాలు కూడా ఉండటంతో తన కూతుర్ని అత్యాచారం చేసి... చంపేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. గ్రామానికి చెందిన మోను అనే అబ్బాయిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. దీంతో నాగురన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు మోనుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో మోనును విడుదల చేశారు పోలీసులు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తే రితూ మృతికి కారణాలు బయటకు వస్తాయంటున్నారు అధికారులు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.