ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని.. బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ముగ్గురు కిలాడీ లేడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ముగ్గురు యువతులు ఓ వృద్దుడు ఇంట్లోకి దూరి అతని బట్టలు విప్పేసి.. వీడియోలు తీశారు. అనంతరం వాటితో బ్లాక్మెయిల్ చేశారు. వివరాలు.. యమునా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వృద్దుడి కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. అతని కూతురికి పెళ్లి కావడంతో.. అతను ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల వృద్దుడి ఇంటికి వచ్చిన ఓ యువతి తనకు పని ఇప్పించాల్సిందిగా కోరింది. పని కోసమని చెప్పి వృద్దుడితో మాట్లాడుతూ ఉండిపోయింది. అయితే సరిగ్గా ఐదు నిమిషాలకు మరో ఇద్దరు యువతులు వృద్దుడి ఇంట్లోకి చేరుకున్నారు.
ఆ ఇద్దరు యువతులు.. తాము పోలీసులమని వృద్దుడిని బెదిరించారు. అనంతరం వృద్దుడి బట్టలు తీసేసి.. అతన్ని వీడియో తీశారు. తర్వాత ఆ వీడియోను అడ్డం పెట్టకుని అతన్ని డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది మంచి పద్దతి కాదని ఆ ముసలాయన హెచ్చరించిన.. యువతులు వినిపించుకులేదు. అతడు వేడుకున్నప్పటికీ.. ఆ అభ్యర్థనను పరిగణలోని తీసుకోలేదు. మొత్తంగా రూ. 50 వేలు వృద్దుడి వద్ద నుంచి వసూలు చేశారు. ఇంకా తమ చెప్పినట్టుగా చేయకుంటే తప్పుడు కేసులో ఇరికిస్తామని.. జైలు జీవితం గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. వీడియో వైరల్ అవుతుందని బ్లాక్మెయిల్ చేశారు.
కనిపించకుండా పోయిన పోస్టాఫీస్ ఉద్యోగిని.. నాలుగు రోజుల తర్వాత కుటుంబానికి తెలిసిన షాకింగ్ న్యూస్..
అయితే ఈ ఘటనకు సంబంధించి వృద్దుడు యమునా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blackmail, Crime news, Haryana