Haryana Chemical Plant Catches Fire: హర్యానాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వ్యాపించాయి. అక్కడి ప్రదేశం అంతా.. దుమ్ము, ధూళి, పొగతో నిండిపోయింది. ఈ ప్రమాదం సోనిపట్ లోని కుండ్లీ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. వెంటనే స్థానికుల సమాచారంలో అధికారులు ఫైరింజన్ లను ఘటన స్థలానికి తరలించారు.
ఫైర్ సెఫ్టీ అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మంటలు ఉవ్వేత్తున ఎగిసిపడుతున్నాయి. హర్యానా ప్రభుత్వం అభ్యర్థన మేరకు.. ఢిల్లీ నుంచి మరిన్ని ఫైర్ సర్వీస్ లను రప్పించారు. ప్రస్తుతం అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలలో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు అదుపు చేయడానికి అధికారులు గంటల తరబడి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో అంబులెన్స్ లను మోహరించారు.
A fire has broken out in a chemical factory in the Kundli area of Sonipat, Haryana. On the special request of Haryana, the Delhi fire service also sent its firefighters for the operation. The cause of the fire is not yet known: Delhi Fire Service pic.twitter.com/ml5PRPqpEu
— ANI (@ANI) April 17, 2022
గతంలో ముంబైలో కూడా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) జరిగింది. కర్రీ రోడ్డు ప్రాంతంలో ఉన్న 60 అంతస్తుల అవిఘ్నా పార్క్ టవర్ (Avighna Park Tower)లో మంటలు చెలరేగాయి. 19వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను చూసి ఆ భవనంలో నివసిస్తున్న వారు భయంతో వణికిపోయారు. కొందు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఐతే ఓ వ్యక్తి 19వ అంతస్తు బాల్కని నుంచి కింద పడి మరణించారు. మృతుడిని 30 ఏళ్ల అరుణ్ తివారిగా గుర్తించారు పోలీసులు. అతడు కింద పడిన వెంటనే హుటాహుటిన KEM ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఉదయం 11.50 నిమిషాల సమయంలో భవనం నుంచి మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 26 మందికి మంటల నుంచి కాపాడారు. ఇక ముందు జాగ్రత్తగా 19 అంతస్తులో ఉండే మిగతా వారిని కిందకు తరలించారు. ఈ ప్రమాదాన్ని లెవెల్-4 గుర్తించారు అధికారులు. అంటే చాలా తీవ్రమైన అగ్నిప్రమాదమని చెప్పారు. అగ్నిప్రమాదానికి గురైన అవిఘ్నా పార్క్ టవర్లో మొత్తం 61 అంతస్తులు ఉన్నాయి. ఐతే ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Haryana