Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

మహా ఇల్లాలు.. మొగుడితో చిన్న పాటి గొడవ.. ఆ మాత్రం దానికి ఇంత ఘోరం చేయాలా..?

మహా ఇల్లాలు.. మొగుడితో చిన్న పాటి గొడవ.. ఆ మాత్రం దానికి ఇంత ఘోరం చేయాలా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: భర్తతో చిన్న పాటి గొడవ జరిగింది. ఇద్దరు వాగ్వాదానికి దిగారు. భార్యకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. దీంతో తన భర్తను నోటికొచ్చినట్టు తిట్టింది.

కాపురం అన్నాక గొడవలు (family disputes) కామన్. వీటిని మాట్లాడి పరిష్కరించుకోవాలి. కొందరు పెళ్లవ్వక ముందు వారు పెరిగిన పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకే అత్తింట్లో అలవాటు అయి, కుదురుగా ఉండటానికి కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలో.. కొన్ని తెలిసి.. తెలియని తన వలన గొడవలు సంభవిస్తాయి. కొందరు భార్యభర్తలు.. ఈ మాత్రం దానికే కంట్రోల్ తప్పుతుంటారు. కోపంలో దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. హర్యానాలో (Haryana) దారుణమైన ఘటన జరిగింది. అంబాలా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోహతాష్, కమలేష్ భార్యభర్తలు. పెళ్లైనప్పటి (family disputes) నుంచి వీరిద్దరు తరచుగా గొడవలు పడేవారు. ఈ క్రమంలో వీరి గొడవలు కాస్తా ఎక్కువయ్యాయి. అయితే, ఒక రోజు భార్య భర్తల మధ్య గొడవలు పీక్స్ కు వెళ్లాయి. దీంతో కమలేష్.. భర్తపై దాడిచేసింది. అతడిపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో అతను కుప్పకూలిపోయాడు. అతడిని కాళ్లు చేతులు కట్టేసింది. మూట కట్టి రెండు రోజుల పాటు టాయ్ లెట్ లో (Wife killed husband) ఉంచింది. అయితే, బాధితుడి, సోదరి..భూరి ఇంటికి వచ్చింది. ఇల్లంతా దుర్వాసన వస్తుండటంతో అడిగింది.


ఎలుక చనిపోయిందని సమాధానం ఇచ్చింది. తన సోదరుడు బైటకు వెళ్లాడని రాలేదని సమాధానం ఇచ్చింది. కమలేష్ వాలకం.. పట్ల ఆమెకు అనుమానం కల్గింది. టాయ్ లేట్ కు తాళం ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే తన సోదరుడి కోసం ఆరాతీసింది. రెండు రోజుల నుంచి కన్పించక పోవడంతో పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదుచేశారు. అప్పటికే కమలేష్.. అతగాడి శవాన్ని ఇంటిపక్కన ఉన్న మురుగు నీటిలో పడేసింది. దీంతో స్థానికులు దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు.మురుగులో పోలీసులు శవాన్ని గుర్తించారు. ఆ శవం.. రోహతాష్ గా గుర్తించారు. ఈ పని.. కమలేష్ దే అని తెలింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా  మహారాష్ట్రలో (maharashtra) అమానుషం జరిగింది.

నాగపూర్ (nagpur)  ప్రాంతంలోని అమర్ నరగ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. నర్మూ సీత యాదవ్ (40), కల్పన యాదవ్ లకు 2013 లో పెళ్లి జరిగింది. ఇతను పెళ్లైనప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. ఇతడిని ఇల్లరికం (Family disputes) తెచ్చుకున్నారు. భగవాన్ రావరే (75), పుష్ప రావరే(70) లు ఇతని అత్తమామలు. అయితే, ఇంటికి వచ్చినప్పటి నుంచి అల్లుడి, కూర్చుని తింటూ.. ఏదో ఒకటి కావాలని వేధిస్తుండేవాడు. కూతురు మోహం చూసి అత్తమామలు ఏమనే వారు కాదు. ఈ క్రమంలో.. మామ..కొన్ని మేకలను విక్రయించాడు. ఇది అల్లుడికి తెలిసింది. తనకు డబ్బులను ఇవ్వాలని మామను వేధించాడు.

భార్యతో గొడవ పడ్డాడు. అల్లుడు నర్మూ సీతాయాదవ్.. ఆదివారం రాత్రి.. ఇంట్లో గొడవకు దిగాడు. తన పేరు మీద ఇంటిని రాసివ్వాలని (Dowry harassment) డిమాండ్ చేశాడు. దీంతో అత్తమామలు ప్రతిఘటించారు. దీంతొ అతను కోపంలో అక్కడ ఉన్న గొడ్డలి పట్టుకుని, అత్తమామలపై దాడిచేశాడు. వారిని ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో వారు అక్కడే కుప్పకూలి పడిపోయారు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడిచేశాడు. ఆ తర్వాత.. అక్కడినుంచి పారిపోయాడు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అత్తమామలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయారు. కూతురుని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Family dispute, Haryana, WOMAN