15 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతికి పెళ్లి.. సీక్రెట్‌గా ఉంచిన ఇరు కుటుంబాలు.. ఎలా బయటపడిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

15 ఏళ్ల బాలుడికి, 25 ఏళ్ల మహిళతో వివాహం జరిగింది. అయితే పెళ్లి కొడుకు మైనర్ కావడంతో.. ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది.

 • Share this:
  15 ఏళ్ల బాలుడికి, 25 ఏళ్ల మహిళతో వివాహం జరిగింది. అయితే పెళ్లి కొడుకు మైనర్ కావడంతో.. ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలుడి అక్క భర్త ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని ఫతేహాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఖుంబర్ గ్రామానికి చెందిన బాలుడి బావ.. గోవింద్‌రామ్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను ఇంటికి పంపడానికి అత్తామామలు అంగీకరించకపోవడంతో కోపం వచ్చిన గోవిందరామ్.. సర్దార్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి బామ్మర్ది పెళ్లి విషయాన్ని వివరించాడు.

  ‘ఖుంబర్ గ్రామానికి చెందిన దల్బీర్ అలియాస్ బిహారీ కొడుకుకు 2019 మే 14న దోబి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే ఆ సమయంలో నేను వివాహాన్ని వ్యతిరేకించాను. కానీ అత్తమామలు(దల్బీర్ దంపతులు) నన్ను చంపేస్తామని బెదిరించారు. నా బామ్మర్ది పుట్టిన 2014 జనవరి 1. వివాహం జరిగిన నాటికి అతడి వయసు 15 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం నా భార్యను కూడా అత్తమామల ఇంటి వద్దే ఉంచుకుంటున్నారు’ అని గోవింద్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  అలాగే బాలుడికి, యువతికి జరిగిన పెళ్లికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు సమర్పించాడు. పెళ్లి సమయంలో తీసిన ఫొటోలను, అంగన్‌వాడీ రికార్డులను ఆయన పోలీసులకు అందజేశాడు. బామ్మర్ధి భార్యకు ఏడో నెలలో గర్భస్రావం జరిగిందని కూడా చెప్పాడు.

  ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి తండ్రి దల్బీర్, తల్లి సరోజ్ దేవి, బాలుడి భార్య, ఆమె తల్లిదండ్రులతో పాటుగా మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదైంది.
  Published by:Sumanth Kanukula
  First published: