మహిళలపై వేధింపులు : షాకింగ్ విషయాలు వెల్లడి.. విద్యార్థుల కంటే వాళ్లే ఎక్కువ..

పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఫిర్యాదు చేసేందుకు చాలామంది విద్యార్థినులు,మహిళలు వెనుకడుగు వేస్తుండటం వల్లే ఈవ్ టీజర్స్ మరింత రెచ్చిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. వేధింపులు ఎవరి నుంచి ఎదుర్కొన్నా సరే.. వెంటనే పెద్దలకు తెలిపి.. పోలీసులను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందంటున్నారు.

news18-telugu
Updated: July 15, 2019, 3:34 PM IST
మహిళలపై వేధింపులు : షాకింగ్ విషయాలు వెల్లడి.. విద్యార్థుల కంటే వాళ్లే ఎక్కువ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బస్టాండ్స్.. రైల్వే స్టేషన్స్.. కాలేజీలు.. పని ప్రదేశాలు.. ఇలా ప్రతీచోటా మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయట అడుగు పడితే చాలు.. తిరిగి ఇంటికొచ్చేంతవరకు అడుగడుగునా మహిళలను అభద్రతా భావం వెంటాడుతోంది. మహిళా రక్షణకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నా.. ఆకతాయిల వేధింపులు పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య మూలాలను తెలుసుకునే పనిలో పడ్డారు హైదరాబాద్ పోలీసులు. ఇందుకోసం మహిళల పట్ల వేధింపులకు సంబంధించిన డేటా రెడీ చేశారు. ఆశ్చర్యకరంగా ఇందులో విద్యార్థుల కంటే ప్రైవేట్ ఉద్యోగులే మహిళలను ఎక్కువగా వేధిస్తున్నట్టు వెల్లడైంది.

ఈ ఏడాది మే నెల వరకు మహిళల పట్ల వేధింపులకు సంబంధించి నగరంలో 522 కేసులు నమోదయ్యాయి. ఇందులో 226 కేసులు ప్రైవేట్ ఉద్యోగులపై నమోదు కాగా.. 140 కేసులు విద్యార్థులపై నమోదయ్యాయి. విద్యార్థుల కంటే ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగులు మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడటం పోలీసులను ఆలోచనలో పడేసింది.మహిళల పట్ల వేధింపులకు పాల్పడి కేసులు నమోదైనవారితో పోలీసులు వ్యక్తిగతంగా మాట్లాడారు. పోర్న్ వీడియోలు,సినిమాల్లోని హింసాత్మక సంఘటనలే వారిని వేధింపుల వైపుగా నడిపిస్తున్నాయని వారిలో చాలామంది పోలీసులతో తెలిపారు. వేధింపులతో వారిని లోబర్చుకుని కోర్కెలు తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే వారి వెంటపడుతున్నట్టు వెల్లడించారు. ఫోన్ నంబర్స్ సంపాదించి అసభ్య మెసేజ్‌లు పెట్టడం లేదా ఫేస్‌బుక్‌లో తరుచూ మెసేజ్‌లు చేస్తుంటామని పోలీసులతో తెలిపారు.

కాగా, పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఫిర్యాదు చేసేందుకు చాలామంది విద్యార్థినులు,మహిళలు వెనుకడుగు వేస్తుండటం వల్లే ఈవ్ టీజర్స్ మరింత రెచ్చిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. వేధింపులు ఎవరి నుంచి ఎదుర్కొన్నా సరే.. వెంటనే పెద్దలకు తెలిపి.. పోలీసులను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందంటున్నారు.First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>