• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • HARASSED FOR DOWRY WOMAN HANGS SELF TO DEATH IN KALABURAGI KARNATAKA AND HER HUSBAND OTHERS BOOKED SSR

Wife: సివిల్ ఇంజనీర్ భార్యకు ఇలాంటి చావా... రెండున్నరేళ్ల క్రితం పెళ్లి.. ఇంతలోనే ఇలా.. అసలేం జరిగిందంటే..

రచిత (ఫైల్ ఫొటో)

  • Share this:
    కలబురిగి: కన్న కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆలోచిస్తారు. అబ్బాయి గురించి ఆరా తీస్తారు. గుణగణాల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగం, సంపాదన.. ఆ సంపాదన తమ కూతురిని సంతోషంగా ఉంచగలదా, లేదా ఇలా బోలెడు ఆలోచించి పెళ్లి చేసి కాపురానికి పంపుతుంటారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంతలా ఆలోచించి పెళ్లిళ్లు చేసి పంపుతున్నా ఒక్కొక్కసారి ఆ లెక్కలు తప్పుతున్నాయి. కన్న కూతురికి మెట్టినింట్లో కష్టాలు తప్పడం లేదు. అదనపు కట్నం కోసం అత్తింటి వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. బాగా చదువుకుని.. ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న కొందరు కూడా ఇలా భార్యలను అదనపు కట్నం కోసం వేధిస్తుండటం సిగ్గుచేటు. ఆ వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరి విషయంలో మెట్టినింటి వాళ్లే కోడలిని కడతేర్చుతున్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఇలాంటి ఓ విషాద ఘటనే వెలుగులోకొచ్చింది. అదనపు కట్నం కోసం భర్తతో సహా అత్తింటి వాళ్లంతా వేధిస్తుండటంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. ఓ పసిబిడ్డకు కన్నతల్లిని దూరం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని కలబురగి పట్టణంలోని బ్యాంకు కాలనీలో నివాసముండే వీరన్న సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండున్నరేళ్ల క్రితం రచిత(21)తో వివాహమైంది. పెళ్లి సమయంలో అబ్బాయి సివిల్ ఇంజనీర్ కావడంతో కూతురిని సుఖంగా చూసుకుంటాడన్న ఉద్దేశంతో రచిత తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. పెళ్లయిన కొన్నాళ్లు భార్యతో అన్యోన్యంగానే ఉంటూ మంచిగానే చూసుకున్న వీరన్న రానురాను అదనపు కట్నంపై ఆశపడ్డాడు.

    అదనపు కట్నం కోసం రచితను వేధించడం మొదలుపెట్టాడు. అతనికి తోడు అత్తమామలు కూడా అదనపు కట్నం కోసం కోడలిని సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఎవరికి చెప్పుకోవాలో రచితకు అర్థం కాలేదు. కన్నవాళ్లకు చెప్పుకోలేక.. చెబితే ఎక్కడ బాధపడతారోనని తనలో తానే కుమిలిపోయింది. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో భరించలేకపోయిన రచిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంగతి తెలిసిన ఆమె తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వెళ్లారు. కూతురిని విగతజీవిగా చూసి హతాశులయ్యారు.

    ఇది కూడా చదవండి: Miryalaguda: పెట్రోల్ కొట్టించుకుందామని 24 ఏళ్ల యువకుడు బైక్‌పై బంక్‌కు వెళుతున్నాడు.. ఇంతలో..

    తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. అత్తింటి వాళ్లే అదనపు కట్నం కోసం పిశాచాల్లా తన కూతురిని పొట్టనపెట్టుకున్నారని రచిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రచిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రచిత భర్త వీరన్న, రచిత అత్తమామలు లక్ష్మీభాయి, చంద్రకాంత్‌పై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రచిత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆమె కుటుంబానికి అప్పగించారు. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా ఇలా అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తుండటం నిజంగా శోచనీయం.
    Published by:Sambasiva Reddy
    First published: