Stampede In South korea : సౌత్ కొరియాలో(South Korea)ఘోర విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి సౌత్ కొరియా రాజధాని సియోల్ లో హాలోవీన్(Halloween) వేడుకల సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇటావోన్ ప్రాంతంలో ఇరుకైన వీధి గుండా వేలాది మంది ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇటావోన్ లీజర్‌లోని హామిల్టన్ హోటల్ సమీపంలో లక్షల మంది వేడుకల్లో పాల్గొనగా..దగ్గర్లోని ఓ బార్ కు తమ అభిమాన సెలబ్రిటీ వచ్చాడని తెలుసుకుని అంతా అటువైపు పరుగెత్తారు. ఇరుకైన వీధిలో వందల మంది వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 149మంది మృతి చెందగా,150 మందికి గాయాలయ్యారు.
సమాచారం అందిన వెంటనే 400 మంది ఎమర్జెన్సీ సిబ్బంది 140 అంబులెన్సులతో రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీప హాస్పిటల్స్ కు తరలించారు. క్షతగాత్రుల్లో సుమారు 50 మందికి గుండెపోటు వచ్చిందని, వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని అగ్నిమాపక విభాగం చీఫ్ చోయ్ సియోంగ్ బియోమ్ మీడియాకు తెలిపారు. కరోనా నిబంధనలను సడలించడం వల్ల ప్రజలు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో హాలోవిన్ ఉత్సవానికి హాజరయ్యారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా,ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. ఓ వీడియోలో ఓ ఇరుకైన రోడ్డు మీద కొందరు వ్యక్తులకు సీపీఆర్(Cardiopulmonary Resuscitation)చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.మరో వీడియోలో కుప్పలుగా పడి ఉన్న మనుషులను కొందరు ఎమర్జెన్సీ సిబ్బంది బయటకు లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి.
Rishi Sunak: యూకే పీఎం కోర్ టీమ్ సభ్యుడి పూర్వీకులది బీహార్..సుయెల్లా బ్రేవర్మన్ నియామకంపై వివాదం
충격주의)이태원 길거리에 덮어진 모포
저 사람들이 다 심정지된 상태고 병원에 가면 사망선고 받는 거임... pic.twitter.com/UXgN9UCPUS — 이것저것 소식들 (@feedforyou11) October 29, 2022
కాగా,ఈ ఘటనపై దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఎయోల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, South korea