HALF BURNT DEAD BODY FOUND IN DRAINAGE IN GUNTUR DISTRICT FULL DETAILS HERE HSN
చెత్తకుప్పలో షాకింగ్ సీన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంటే కనిపించిన దృశ్యాన్ని చూసి..
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పదహారో నెంబర్ జాతీయ రహదారి పక్కన బోయపాలెం సమీపంలో రోడ్డు పక్కనే ఓ చెత్త కుప్ప ఉంది. శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులకు ఆ చెత్తకుప్ప వద్ద ఓ షాకింగ్ సీన్ కనిపించింది.
రోడ్డు పక్కన చెత్తకుప్ప. తీవ్ర దుర్గంధం వచ్చే ఆ రోడ్డుపక్కన నడచుకుంటున్న వాళ్లు ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి అక్కడ చెత్త కుప్పను తొలగిస్తుంటుంటారు. కానీ శనివారం ఉదయం మాత్రం అక్కడ ఓ షాకింగ్ సీన్ కనిపించింది. అటుగా వెళ్లే వాళ్లు ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెత్త కుప్పలో కట్టలకు కట్టలు డబ్బో, ఇంకేదో విలువైన వస్తువో కనిపించిందనుకుంటే పొరపాటే. రోడ్డు పక్కన ఉన్న ఆ చెత్తకుప్పలో ఓ శవం బయటపడింది. అది కూడా సగం కాలిపోయి ఉంది. ఘటన జరిగిన విధానం చూస్తే ఎవరో చంపి, అతడిని అక్కడకు తీసుకొచ్చి కాల్చేసినట్టుగా కనిపించింది. పోలీసులు ఈ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పదహారో నెంబర్ జాతీయ రహదారి పక్కన బోయపాలెం సమీపంలో రోడ్డు పక్కనే ఓ చెత్త కుప్ప ఉంది. శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులకు ఆ చెత్తకుప్ప వద్ద ఓ షాకింగ్ సీన్ కనిపించింది. ఓ యువకుడి మృతదేహం ఆ చెత్త కుప్పలో కనిపించింది. సగానికిపైగా కాలిపోయిన స్థితిలో ఉన్న శవం గురించి వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్, చిలకలూరి పేట రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సై శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని ఆ మృతదేహం గురించిన వివరాల గురించి ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా? అన్నది ప్రశ్నించారు.
మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు సమీప ప్రాంతాలకు చెంది ఉంటాడనీ, ఈ ఘటన గురించి మృతుడి గురించి వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. 9440796268, 94404796256 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు అందించొచ్చని పోలీసులు తెలిపారు. కాగా, రోడ్డు పక్కన ఇలా చెత్తకుప్పలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయిందని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.