సవతి తల్లి దారుణం...కొడుకును మంచానికి కట్టేసి...రెండు రోజుల పాటు అత్యాచారం...

వరుసకు కొడుకు అయిన యువకుడిని సవతి తల్లి శారీరక సంబంధం ఏర్పరచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే గత వారం తండ్రి ఫూల్ సింగ్ పని మీద డెహ్రాడూన్ వెళ్లగా, ఆమె తన కుమారుడిని బంధించి రెండు రోజుల పాటు లైంగిక దాడి చేసింది.

news18-telugu
Updated: July 11, 2020, 9:08 PM IST
సవతి తల్లి దారుణం...కొడుకును మంచానికి కట్టేసి...రెండు రోజుల పాటు అత్యాచారం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక సవతి తల్లి తన కుమారుడు అయిన, మైనర్ బాలుడు తనపై లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే జిల్లాకు చెందిన సోనం( పేరు మార్పు) ఇటీవలే ఫూల్ సింగ్ (పేరు మార్పు) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఫూల్ సింగ్ కు ఓ కుమారుడు ఉన్నాడు. కాగా వరుసకు కొడుకు అయిన యువకుడిని సవతి తల్లి శారీరక సంబంధం ఏర్పరచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే గత వారం తండ్రి ఫూల్ సింగ్ పని మీద డెహ్రాడూన్ వెళ్లగా, ఆమె తన కుమారుడిని బంధించి రెండు రోజుల పాటు లైంగిక దాడి చేసింది. దీంతో కుమారుడు తండ్రికి తన బాధ తెలియచేశాడు. కాగా తన బండారం బయటపడటంతో ఇంటి నుంచి పారిపోయింది. చివరకు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు 323, 504 జెజె యాక్ట్ (జువెనైల్ యాక్ట్), పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం గురించి ఎఎస్ఐ కాశ్మీర్ సింగ్ మాట్లాడుతూ, 'మొదటి భార్య మరణించిన తరువాత, ఆ వ్యక్తి ఆరు నెలల క్రితం రెండవ సారి వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత ఆమె 14 ఏళ్ల కుమారుడిపై లైంగిక దాడి చేసిందని, కాగా కొడుకుతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నందుకు అతడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading