శ్రీనివాస్ కాస్తా... సీరియల్ కిల్లర్ ఎందుకయ్యాడు... సైకో ఎనాలసిస్... పాయింట్లలో...

Hazipur Serial Murders : పోలీసుల క్రైమ్ రికార్డుల్లో సెన్సేషనల్ కేసు ఇది. ఓ మామూలు కుర్రాడు... సైకో కిల్లర్ ఎందుకయ్యాడన్నదానికి దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 1:28 PM IST
శ్రీనివాస్ కాస్తా... సీరియల్ కిల్లర్ ఎందుకయ్యాడు... సైకో ఎనాలసిస్...  పాయింట్లలో...
మనీషా, శ్రావణి, శ్రీనివాస్
Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 1:28 PM IST
ప్రతీ మనిషిలో... సైకో ఉంటాడు. కాకపోతే... అదే మనిషిలోని మంచితనం... ఆ సైకోయిజాన్ని కప్పెట్టేస్తూ ఉంటుంది. దాన్నే మనం మానవత్వం అంటాం. ఐతే... మానవత్వం తగ్గిపోయే కొద్దీ... మనిషి మృగంలా మారతారు. ఈ కేసులో శ్రీనివాస రెడ్డి విషయంలో అదే జరిగింది. అందుకు దారితీసిన కారణాలేంటో మనం తెలుసుకుందాం. యువతుల్నీ, బాలికల్నీ బావిలోకి తోసేసి, గాయపడి మృత్యువుతో పోరాడుతున్న వాళ్లను రేప్ చేసి చంపి, పూడ్చిపెట్టాడంటే... అతను ఎంత క్రూరుడో అర్థం చేసుకోవచ్చు. అంతటి క్రూరత్వం అతనిలో ఎందుకుంది అన్నది మన సైకో ఎనాలసిస్ ద్వారా తెలుసుకుందాం. సింపుల్‌గా అసలేం జరిగిందంటే... యాదాద్రి భువనగిరి జిల్లా... బొమ్మల రామారం మండలం... హాజీపూర్‌లో నాలుగేళ్ల కిందట (2016లో) కల్పన (11), ఈ ఏడాది శివరాత్రి నాడు మనీషా (17), తాజాగా శ్రావణి (14) ని రేప్ చేసి చంపాడు శ్రీనివాస్. సైకో కిల్లర్‌ను అరెస్టు చేసిన పోలీసులు ప్రశ్నించగా... తాను సైకో కిల్లర్ ఎందుకయ్యిందీ వివరించాడు. అసలేం జరిగిందో పాయింట్ల రూపంలో తెలుసుకుందాం.

Hazipur Serial Murders | hazipur serial murders : police dig out another girl body from same well srinivas reddy house caught fire by villagers | యాదాద్రి భువనగిరి జిల్లా... బొమ్మలరామారం మండలం... హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ముగ్గురు బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై గ్రామస్థులు ఆగ్రహాంతో దాడి చేశారు. ఇంటిని తగలబెట్టారు.
నిందితుడు శ్రీనివాస్ రెడ్డి


శ్రీనివాస్ కాస్తా... సీరియల్ కిల్లర్ ఎందుకయ్యాడు :

* హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి బాల్ రెడ్డి, అనసూయ దంపతుల సంతానంలో రెండోవాడు శ్రీనివాస్ రెడ్డి.


* బొమ్మలరామారంలో పదో తరగతి వరకూ చదివాడు. చిన్నప్పటి నుంచీ విపరీత ప్రవర్తన కలిగి వుండేవాడు. అందుకే ఊళ్లో అతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు.
* టెన్త్ తర్వాత శ్రీనివాస్ హాజీపూర్ నుంచీ హైదరాబాద్ వెళ్లి... లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసేవాడు. అది అతని వృత్తి. దాని వల్ల అతను సైకోగా మారలేదు.
* 2015లో (కల్పన హత్యకు ముందు) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళను రేప్ చేశాడు. ఆ విషయం ఊరు దాటి బయటకు రాలేదు.
Loading...
* ఆ తర్వాత కొన్నాళ్లకు (కల్పన హత్యకు ముందు) పశువులను కాస్తున్న ఓ మహిళ (38)ను రేప్ చెయ్యబోయాడు. ఆమె కేకలు వెయ్యడంతో... మైసిరెడ్డిపల్లి ప్రజలు శ్రీనివాస రెడ్డిపై దాడి చేశారు. పోలీస్ కేసు నమోదైంది.
* బాధిత మహిళ కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకున్న శ్రీనివాస రెడ్డి... ఆ కేసు నుంచీ బయటపడ్డాడు. కానీ విపరీత మనస్తత్వం వల్ల తనకు తీవ్ర అవమానం జరిగిందని లోలోపల రగిలిపోయాడు.
* ఆ తర్వాత హాజీపూర్ ఊరిపై, అక్కడి ప్రజలపై పగబట్టాడు. తనను జైలుకు పంపాలని చూసిన వాళ్లను అంత ఈజీగా వదలకూడదనుకున్నాడు.
* ఏ రేప్ కేసులో తాను ఇరుక్కున్నాడో, అదే రేప్‌లు చేసి, పగ తీర్చుకోవాలనుకున్నాడు శ్రీనివాస్.
* రేప్ చేశాక, కచ్చితంగా పోలీస్ కేసు పెడతారనీ, తీవ్రమైన శిక్ష వేస్తారని భావించిన శ్రీనివాస్, అసలు సాక్ష్యాధారాలే లేకుండా చెయ్యాలని స్కెచ్ వేసుకున్నాడు.
* అక్కడున్న 60 అడుగుల బావి వైపు ఎవరూ రారని గ్రహించిన శ్రీనివాస్... అక్కడే తన ప్లాన్ అమలు చెయ్యాలని డిసైడయ్యాడు.
* అలా మొదటిసారి కల్పనను బాలికైన కల్పనను రేప్ చేసి, చంపి కసి తీర్చుకున్నాడు. ఆ తర్వాత... తన స్కెచ్ అమలు చెయ్యడం అంత ఈజీ కాదని భావించాడు.
* దాదాపు రెండేళ్లపాటూ ఆగిన సైకో కిల్లర్ కన్ను... అమాయకంగా కనిపించే మనీషాపై పడింది. మళ్లీ తన స్కెచ్ అమలుకు సిద్ధపడ్డాడు. ఆమెనూ అలాగే చంపాడు.
* రెండు ఘటనల్లో సక్సెస్ అయ్యాననుకున్న శ్రీనివాస్ రెడ్డి, వెంటనే శ్రావణిని టార్గెట్ చేసి చంపేశాడు.
* అతన్ని పట్టుకోకపోయి ఉంటే... మరింత మంది అమ్మాయిల ప్రాణాలు తీసేవాడే.

 

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు... రేప్ కేసులో దోషిగా తేలిన అలెక్స్ హెప్‌బర్న్

హిమాలయాల్లో యతి లేదా... ఇండియన్ ఆర్మీ ట్వీట్‌కి ఆధారాలు లేవన్న సైంటిస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు... ఏర్పాటు దిశగా జోరందుకున్న ప్రయత్నాలు...

ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...
First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...