హాజీపూర్ హత్యల కేసులో ముగిసిన విచారణ.. తుది తీర్పు ఎప్పుడంటే..

శుక్రవారం మరోసారి వాదనలు వినిపించాల్సి ఉండగా డిఫెన్స్ తరపు న్యాయవాది మాత్రం ఎలాంటి వాదనలు వినిపించలేదు. ఈ క్రమంలో జనవరి 27న తుది తీర్పు వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు జడ్జి వెల్లడించారు.

news18-telugu
Updated: January 17, 2020, 6:10 PM IST
హాజీపూర్ హత్యల కేసులో ముగిసిన విచారణ.. తుది తీర్పు ఎప్పుడంటే..
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి
  • Share this:
తెలంగాణలో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో విచారణ ముగిసింది. ఈ నెల 27న తీర్పు వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. హాజీపూర్ హత్యల కేసుకు సంబంధించి కొంతకాలంగా విచారణ జరుగుతోంది. జనవరి 6, 7 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా... 8న డిఫెన్స్ న్యాయవాది వాదనలు వినిపించారు. జనవరి 8న ఒక హత్యకేసుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు.. మరో రెండు కేసుల్లో వాదనలను వినేందుకు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నిందితుడు శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఐతే ఇవాళ మరోసారి వాదనలు వినిపించాల్సి ఉండగా డిఫెన్స్ తరపు న్యాయవాది మాత్రం ఎలాంటి వాదనలు వినిపించలేదు. ఈ క్రమంలో జనవరి 27న తుది తీర్పు వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు జడ్జి వెల్లడించారు.


యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో బాలికల హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రావణి, కల్పన, మనీషాను అత్యాచారం చేసి చంపేశాడు. మూడేళ్లలో ముగ్గురు బాలికలను కిరాతకంగా హత్య చేశాడు. మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో 600 మందికి పైగా సాక్షులను విచారించడంతో పాటు నిందితుడు శ్రీనివాస్ వాంగ్మూలం కూడా కోర్టు తీసుకుంది. ఇక ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు పూర్తడవంతో విచారణను ముగించింది. ఐతే జనవరి 27న ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు