Home /News /crime /

HAJIPUR MURDER CASE SRINIVAS REDDY IS ELIGIBLE FOR DEATH PENALTY SK

శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్షకు అర్హుడు.. ఫాస్ట్ ట్రాక్‌లో కోర్టులో వాదనలు

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

కేవలం తన వాంఛ తీర్చుకోవడం కోసం శ్రీనివాస్ రెడ్డి హత్యలు చేశాడని..ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం మంచిది కాదని స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ఉరిశిక్ష వేయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు.

    రాష్ట్రంలో సంచలనం రేపిన హాజీపూర్ హత్యల కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. పోక్సy స్పెషల్ కోర్టులో బాధితుల వాదనలు వినిపించిన న్యాయవాది.. శ్రీనివాస్ రెడ్డి అన్ని విధాలా అర్హుడని అన్నారు. పసి పిల్లలను రేప్ చేసి, అత్యంత దారుణంగా చంపేసిన ఇలాంటి కిరాతకులనపై జాలి చూపించాల్సిన అవసరం లేదని కోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టుకు మార్గదర్శకాల ప్రకారం ఇది అరుదైన కేసుగా పరిగణించాలని కోరారు. నిందితుడికి నేరచరిత్ర ఉందని.. గతంలోనూ ఒంటరి మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్టు రుజువైందని తెలిపారు. కేవలం తన వాంఛ తీర్చుకోవడం కోసం శ్రీనివాస్ రెడ్డి హత్యలు చేశాడని..ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం మంచిది కాదని స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ఉరిశిక్ష వేయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు.

    యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో బాలికల హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రావణి, కల్పన, మనీషాను అత్యాచారం చేసి చంపేశాడు. మూడేళ్లలో ముగ్గురు బాలికలను కిరాతకంగా హత్య చేశాడు. మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో 600 మందికి పైగా సాక్షులను విచారించింది కోర్టు. త్వరలోనే ఈ కేసులో తీర్పు వస్తుందని.. నిందితుడు శ్రీనివాస్‌కు శిక్షను ఖరారు చేస్తారని సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Hajipur murder case, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు