Home /News /crime /

HACKERS STEAL OVER 600 MILLION IN DARING CRYPTOCURRENCY HEIST PAH

Shocking: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 4,529 కోట్ల 20 లక్షల 30 వేల రూపాయలు హ్యాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyber fraud:  హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగని అతి పెద్ద క్రిప్టో దాడి బ్లాక్ చెయిన్ దోపిడి మార్చి 23 న జరిగింది. ఇప్పటి వరకు జరిగిన సైబర్ దాడుల్లో దీన్ని అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు.

Hackers steal over 600 million: ప్రస్తుతం టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించుకొని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. యాక్సీ ఇన్పినిటీకి మద్దతునిచ్చే.. బ్లాక్ చెయిన్ రోనిన్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇది ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అతి పెద్దది. ఇది అతిపెద్ద క్రిప్టో దాడుల్లో ఒకటిగా ఉంది. దీని కోసం హ్యాకర్లు.. యాక్సీ ఇన్పినిటీ ఆన్ లైన్ గేమ్ కు కనెక్ట్ చేసిన బ్లాక్ చెయిన్ నెట్ వర్క్ ను ఉపయోగించారు. దీంతో సుమారు 600 మిలియన్ డాలర్లను దొంగిలించారు. భారత రూపాయలలో.. ఇది అక్షరాల.. 4,529 కోట్ల 20 లకల 30 వేల రూపాయలు.

యాక్సి ఇన్ఫినిటీ మేకర్ స్కై మావిస్ చేత నోడ్ లుగా పిలువబడే కంప్యూటర్, బ్రిడ్జ్ లు ఉంటాయి. వీటికి మద్దతిచ్చే యాక్సీ డావ్ టోకెన్ లను మరొక నెట్ వర్క్ లో ఉపయోగిస్తారు. దీంతో ప్రజల కంప్యూటర్ లోని సాప్ట్ వేర్ లో ప్రవేశిస్తారు. కంప్యూటర్ లోని డాటాను హ్యాక్ చేస్తారు. ప్రస్తుతం జరిగిన అతిపెద్ద హ్యాకింగ్ లో.. రెండు లావాదేవీలలో జరిగాయి. 173,600 ఈథర్, 25.5 మిలియన్ యూఎస్డీసీ టోకేన్ల రోనిన్ బ్రిడ్జ్ గా ఉంది. ఇది మార్చి 23 న మంగళవారం వెలుగులోనికి వచ్చింది. ఇవి దాడి చేస్తే.. కంప్యూటర్ లు కోడ్ ఆడిట్ చేయబడదు.

హ్యాకర్లు వీటిని ఆపరేట్ చేస్తుంటారు. వీటిలో డాటా అస్పష్టంగా ఉంటుంది. వందల  ట్రాన్స్ జాక్షన్ లను క్రిప్టో రూపంలోకి మారుస్తారు. రోనిన్ బ్లాక్ చెయిన్ ఉపయోగించే టోకెన్ వలన రాన్ ధర హ్యాక్ బయటపడిన తర్వాత.. దాదాపు 22 శాతం కి పడిపోయింది. బ్లాక్ చెయిన్స్ ఫోరెన్సిక్ సంస్థ ఎలిప్టిక్ ప్రకారం.. దొంగిలించబడిన నిధులు క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చబడతాయి.

ఇవి ఆయా బ్లాక్ చెయిన్ ప్లాట్ ఫామ్ లతో మార్చబడతాయి. దీనిలో హ్యాకర్ ప్రధానంగా.. తొమ్మిది మంది వ్యాలిడేర్లలో ఐదుగురు ఈ లింక్ ను క్లిక్ చేస్తే.. దీన్నుంచి నిధులు తరలించవచ్చు. ప్రస్తుతం హ్యాకర్ ఐదు వాలిడేటర్ లకు చెందిన క్రిప్టో గ్రాఫిక్ లను పట్టుకోగలిగాడు. ప్రత్యేక బ్లాక్ చెయిన్ టెక్నిక్ విధానంను సాఫ్ట్ వేర్ మెయిల్స్ ను పంపిస్తాడు. వీటిని క్లిక్ చేయగానే ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వాళ్ల.. కంప్యూటర్ లోని డాటా  అంతా హ్యాకర్ కు చేరిపోతుంది. దీంతో అతను ఆపరేట్ చేస్తు క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చుకుని నిధులను తరలిస్తాడు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Cryptocurrency, CYBER FRAUD, Delhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు